Home /News /national /

GOLD RATES TODAY SILVER RATES TODAY GOLD AND SILVER PRICES HIKED ON DUSSEHRA 2021 HERE IS LATEST RATES IN HYDERABAD SK

Gold Rates Today: పండగ వేళ మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు


ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold and Silver Price today: దసరా వేళ మహిళలకు షాకిస్తూ... ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు సైతం స్పల్పంగా పెరిగాయి. మరి హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

ఇంకా చదవండి ...
    ఇది పండగల సమయం. అంతేకాదు పెళ్లిళ్ల సీజన్ కూడా. . ! సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పండగలతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరగడంతో మహిళలు బంగారం కొంటుంటారు. ఈ క్రమంలోనే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. కొన్ని రోజులుగా  బంగారం రేట్లు పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు స్థిరంగా ఉన్నా.. మళ్లీ పెరగడమే తప్ప తగ్గడం లేదు. విజయదశమి (Dussehra 2021)వేళ మహిళలకు షాకిస్తూ... ఇవాళ కూడా బంగారం ధరలు (Gold rates)భారీగా పెరిగాయి. వెండి ధరలు (Silver Price)సైతం స్పల్పంగా పెరిగాయి. మరి హైదరాబాద్‌ (Hyderabad), విశాఖపట్టణం (Visakhapatnam), విజయవాడ (Vijayawada) సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి  ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

    బంగారం ధరలు:

    నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,700గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.550 పెరిగింది. అదే ఒక్క గ్రాము కావాలంటే 4,470కి లభిస్తోంది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల ఈ బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.48,760 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.600 పెరిగింది. స్వచ్ఛమైన బంగారం ఒక్క గ్రాము ధర రూ.4,876గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి.

    Reducing Cooking Oil Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధరలు..

    దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

    చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.45,050గా ఉంది. ఇక ముంబైలో రూ.46,970, ఢిల్లీలో 46,850, బెంగళూరులో రూ.44,700, కేరళలో 44,700, అహ్మదాబాద్‌లో 45,580, జైపూర్‌లో 47,000గా ఉన్నాయి.

    దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

    చెన్నైలో 49,140, ముంబైలో 47,970, ఢిల్లీలో రూ.51,110, కోల్కతాలో రూ.50,000, బెంగళూరులో రూ.48,760 కేరళలో 48,700, అహ్మదాబాద్‌లో 49,720, జైపూర్‌లో 49,250గా ఉన్నాయి.

    అక్టోబరు 7 నుంచి బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గత 10 రోజుల్లో బంగారం ధరలు ఐదు సార్లు పెరిగాయి. ఒకే ఒక్కసారి తగ్గగా... నాలుగు సార్లు స్థిరంగా ఉన్నాయి.

    Gold Investments: పండుగ సీజన్‌లో బంగారం ఏ రూపంలో కొనాలి?.. ఏది బెస్ట్

    హైదరాబాద్‌లో వెండి ధరలు:

    హైదరాబాద్ మార్కెట్‌లో  కిలో వెండి రూ.66,600కి లభిస్తోంది. 10 గ్రాముల ధర రూ.666 గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల వెండి ధర రూ.8 పెరిగింది. ప్రసుతం ఒక్క గ్రాము వెండి 66.60కి దొరుకుతోంది.

    దేశవ్యాప్తంగా వెండి ధరలు

    చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.666గా ఉంది. హైదరాబాద్, కేరళ, మధురైలో కూడా ఇదే రేటుకు దొరుకుతోంది. ఇక ముంబై న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు,పుణె, అహ్మదాబాద్, జైపూర్‌లో రూ.632 లభిస్తోంది. వెండి ధరలు గత పది రోజుల్లో నాలుగు సార్లు పెరిగాయి. ఒకే ఒక్కసారి తగ్గాయి. ఐదు రోజులు స్థిరంగా ఉన్నాయి.

    Pension Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు రూ.1,78,000 పెన్షన్... ఎంత  పొదుపు చేయాలో తెలుసా?

    బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రతి రోజూ మారుతుంటాయి.  అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం ప్రధానమైన కారణాలు. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ పలు కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Gold price, Gold rate, Silver price, Silver rate

    తదుపరి వార్తలు