Home /News /national /

GOLD MEDALLIST RABEEHA FROM PONDICHERRY UNIVERSITY REFUSED TO COLLECT HER AWARD SK

రాష్ట్రపతి ఈవెంట్‌లో అవమానం.. గోల్డ్ మెడల్ తిరస్కరించిన విద్యార్థిని

కాన్వకేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్థమైందని పోలీసులు తెలిపారు. అందుకే ఆమెతో పాటు పలువురిని హాల్ నుంచి బయటకు పంపించినట్లు వెల్లడించారు.

కాన్వకేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్థమైందని పోలీసులు తెలిపారు. అందుకే ఆమెతో పాటు పలువురిని హాల్ నుంచి బయటకు పంపించినట్లు వెల్లడించారు.

కాన్వకేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్థమైందని పోలీసులు తెలిపారు. అందుకే ఆమెతో పాటు పలువురిని హాల్ నుంచి బయటకు పంపించినట్లు వెల్లడించారు.

    రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ హాజరైన స్నాతకోత్సవ కార్యక్రమంలో తనకు అవమానం జరిగిందని ఓ విద్యార్థిని సంచలన నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ ప్రకటించిన గోల్డ్ మెడల్‌ను తిరస్కరించి నిరసన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా CAA, NRCకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    రబీహా అనే విద్యార్థిని పాండిచేరి యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసింది. 2018 సంవత్సరానికి గాను ఆమెకు గోల్డ్ మెడల్ ప్రకటించింది యూనివర్సిటీ. ఇటీవల యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమంలో గోల్డ్ మెడల్ అందుకోవాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐతే హిజాబ్ తొలగించిన తర్వాతే హాల్ లోపలికి రావాలని సెక్యూరిటీ సిబ్బంది తనను ఆదేశించారని రబీహా తెలిపారు. హిజాబ్ తొలగించాలంటూ తనను, తన సామాజిక వర్గాన్ని అవమానించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

    రబీహా న్యూస్‌తో 18తో మాట్లాడుతూ.. ''ఇది నాకు మాత్రమే కాదు. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ అవమానం. అందుకే గోల్డ్ మెడల్‌ను తిరస్కరించాను. CAA, NRCకి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. హిందూ,ముస్లిం.. ఇలా అన్ని వర్గాల వారు నిరసనలు చేపట్టారు. వారందరికీ నా సంఘీభావం తెలుపుతున్నా.'' అని పేర్కొన్నారు.
    ఐతే CAAకి వ్యతిరేకంగా పాండిచేరి యూనివర్సిటీలో రబీహా ఆందోళనలు చేసిందని.. కాన్వకేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్థమైందని పోలీసులు తెలిపారు. అందుకే ఆమెతో పాటు పలువురిని హాల్ నుంచి బయటకు పంపించినట్లు వెల్లడించారు. ఇక కార్తీక అనే మరో గోల్డ్ మెడలిస్ట్ కూడా పతకాన్ని తిరస్కరించారు. CAAకి రామ్‌నాత్ కోవింద్ ఆమోద ముద్ర వేశారని.. అందుకే ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఇష్టం లేదని తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Citizenship Act, Citizenship Amendment Act

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు