గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో బంగారం రవాణా.. పట్టుకున్న ఈసీ

న్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా, అందులో బంగారం బయటపడింది. అది కూడా గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బంగారం ఉంది.

news18-telugu
Updated: April 17, 2019, 8:26 PM IST
గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో బంగారం రవాణా.. పట్టుకున్న ఈసీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడులో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు వద్ద రెండు వాహనాల్లో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా, అందులో బంగారం బయటపడింది. అది కూడా గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బంగారం ఉంది. సుమారు 1381 కేజీల బంగారాన్ని ఈసీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అయితే, ఈ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదని డ్రైవర్లు చెప్పినట్టు తెలిసింది. తమిళనాడులోని వేలూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భారీ ఎత్తున డబ్బు పట్టుబడడంతో అక్కడ ఎన్నికలను అధికారులు రద్దు చేశారు. ఈనెల 18న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు నేతల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు