హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Royal Mint: వినాయకుడి ప్రతిమతో గోల్డ్ బార్స్‌.. పండగ సందర్భంగా ఆఫర్.. ఎక్కడో తెలుసా !

Royal Mint: వినాయకుడి ప్రతిమతో గోల్డ్ బార్స్‌.. పండగ సందర్భంగా ఆఫర్.. ఎక్కడో తెలుసా !

 వినాయకుడి ప్రతిమతో గోల్డ్ బార్స్‌.. పండుగ సందర్భంగా ఆఫర్.. ఎక్కడో తెలుసా !

వినాయకుడి ప్రతిమతో గోల్డ్ బార్స్‌.. పండుగ సందర్భంగా ఆఫర్.. ఎక్కడో తెలుసా !

ఈ ఏడాది గణేశ్ చతుర్థి(Ganesh Chaturthi) సందర్భంగా బ్రిటీష్ నాణేల తయారీ సంస్థ రాయల్ మింట్ వినాయకుడి ప్రతిమ ఉండే గోల్డ్ బార్స్ విడుదల చేయనుంది. ఆగస్టు 31న వినాయక చవితి పురస్కరించుకుని.. మంగళవారం 24 క్యారెట్లు, 20 గ్రాముల గోల్డ్(Gold) బార్‌ను విడుదల చేయనుంది.

ఇంకా చదవండి ...

ఈ ఏడాది గణేశ్ చతుర్థి (Ganesh Chaturthi)సందర్భంగా బ్రిటీష్(British) నాణేల తయారీ సంస్థ రాయల్ మింట్ వినాయకుడి ప్రతిమ ఉండే గోల్డ్(Gold) బార్స్ విడుదల చేయనుంది. ఆగస్టు 31న వినాయక చవితి పురస్కరించుకుని.. మంగళవారం 24 క్యారెట్లు, 20 గ్రాముల గోల్డ్ బార్‌ను విడుదల చేయనుంది. మొత్తం 10,000 బార్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఒక్కో దాని విలువ సుమారు రూ.1 లక్షగా పేర్కొంటున్నారు.

లక్షీదేవి ఇమేజ్‌తో..

గత సంవత్సరం దీపావళికి ముందు లక్షీదేవి ఇమేజ్‌తో విడుదల చేసిన 999.9 ఫైన్ బులియన్ బార్‌కు మంచి ఆదరణ లభించింది. ఇదే తరహాలో బ్రిటిష్ భారతీయులు, భారత ప్రజల్లో తాజా గోల్డ్ బార్స్ ప్రజాదరణ పొందుతాయని భావిస్తున్నారు. ఇది రాయల్ మింట్ తయారు చేసిన, హిందూ(Hindu) దేవతకు చెందిన మొదటి బులియన్ సావనీర్. ఇది అమ్మకానికి వచ్చిన మొదటి వారంలోనే విక్రయాలు పూర్తయిపోయాయి. తర్వాత రెండోసారి విక్రయాలు ప్రారంభించారు. ధన్‌తేరస్‌ (ధన త్రయోదశి) నాడు అత్యధిక సింగిల్-డే అమ్మకాలు నమోదయ్యాయి. కొనుగోలుదారులలో ఎక్కువ మంది బ్రిటిష్ భారతీయులు ఉన్నారు.

వినాయకుడి రూపంతో ఉన్న కొత్త బార్ హెన్నా ప్యాటర్న్‌డ్‌ స్లీవ్‌లో వస్తుంది. ప్రతి ఒక్కటి ప్రత్యేక క్రమ సంఖ్యతో తయారవుతుంది. గణేశుడి పాదాల వద్ద లడ్డూల ట్రే ఉండేలా వీటిని డిజైన్ చేశారు రాయల్ మింట్ డిజైనర్ ఎమ్మా నోబెల్. ఇది ప్రపంచంలోని విలాసాలను సూచిస్తుంది. విరిగిన దంతాలు భౌతిక ప్రపంచంలోని లోపాలను, జ్ఞానం కోసం అవసరమైన త్యాగాలను సూచిస్తాయి. వినాయకుడి అరచేతిపై ఓం గుర్తు ఉంటుంది. ఇది అధిగమించాల్సిన ప్రాపంచిక కోరికలను సూచిస్తుంది.

కార్డిఫ్‌లోని శ్రీ స్వామినారాయణ దేవాలయంలో సాంస్కృతిక సలహాదారు, భక్తుడు నీలేష్ కబారియాతో కలిసి డిజైన్ నాణ్యత అంశంలో పనిచేసింది రాయల్ మింట్. గణేశుడిని కచ్చితంగా రూపొందించడానికి అవసరమైన అన్ని అంశాలను కబారియా రాయల్ మింట్‌కి అందించారు. వినాయకుడి రూపాన్ని కచ్చితంగా తీర్చిదిద్దేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బుధవారం అందుబాటులోకి వస్తున్న బంగారు కడ్డీలలో ఒకదాన్ని ఓల్లడ్‌హోమ్‌లోని శ్రీ స్వామినారాయణ ఆలయాలనికి కంపెనీ అందజేయనుంది.

ఇదీ చదవండి: Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


కబారియా మాట్లాడుతూ.. ‘రాయల్ మింట్ హిందూ సమాజంతో కలిసి పనిచేయడం అద్భుతం. ఇది హిందూ సంస్కృతిపై మరింత అవగాహనను తెస్తుంది. బ్రిటీష్ రాజులు, రాణుల ప్రతిరూపాలను నాణేలపై ముద్రించారు. ఇప్పుడు ఇతర సంస్కృతులపై దృష్టి పెట్టడం మంచి విషయం.’ అని చెప్పారు. రాయల్ మింట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నికోలా హొవెల్ మాట్లాడుతూ, వైవిధ్యంపై కమిట్‌మెంట్‌ను చూపడానికి రాయల్‌ మింట్‌కు ఇదొక మార్గమని చెప్పారు.

రాయల్ మింట్(RM) అనేది నాణేలను ముద్రించే యూకే ప్రభుత్వ సంస్థ. ఇది ప్రపంచంలో నాణేలను ఎగుమతి చేసే కంపెనీల్లో ప్రముఖ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం సగటున 60 దేశాల కోసం నాణేలు, పతకాలను తయారు చేస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నాణేలను, పతకాలను తయారు చేయడం, పంపిణీ చేయడం రాయల్‌ మింట్‌ ప్రధాన బాధ్యత. వినాయక చవితి సందర్బంగా ఈ సంస్థ ఇప్పుడు గణేషుడి ప్రతిమతో గోల్డ్ బార్స్‌ తయారు చేసి, అందుబాటులోకి తెస్తోంది.

First published:

Tags: Ganesh Chaturthi​, Gold bars, Hindu festivals, Hindu Temples

ఉత్తమ కథలు