కల్కి ఆశ్రమంలో నోట్ల గుట్టలు.. బంగారం, వజ్రాల మూటలు

కల్కి భగవాన్ అసలు పేరు విజయకుమార్ నాయుడు. గతంలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేసిన విజయకుమార్.. కొన్నేళ్ల తర్వాత చిత్తూరులో జీవాశ్రమ్ పేరుతో రెసిడెన్షియ్ల్ స్కూల్ నిర్వహించారు. ఆ తర్వాత తనకు తానుగా మహావిష్ణు అవతారమని ప్రకటించుకొని కల్కి భగవాన్‌గా మారిపోయారు.

news18-telugu
Updated: October 18, 2019, 5:47 PM IST
కల్కి ఆశ్రమంలో నోట్ల గుట్టలు.. బంగారం, వజ్రాల మూటలు
కల్కీ దంపతులు
news18-telugu
Updated: October 18, 2019, 5:47 PM IST
మహావిష్ణు అవతారమని చెప్పుకునే కల్కి భగవాన్ అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మూడు రోజులుగా సోదాలు చేసిన ఐటీశాఖ అధికారులు కల్కి ఆశ్రమాల్లో నోట్ల గుట్టలను వెలికితీశారు. తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని సుమారు 40 ప్రాంతాల్లో ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలు, వెల్‌‌నెస్ సెంటర్లు, కల్కి కుమారుడు కృష్ణ నివాసాల్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ సోదాల్లో రూ.44 కోట్ల నగదుతో పాటు 88 కేజీల గోల్డ్ (వీటి విలువ రూ.26 కోట్లు), 1271 కేరట్ల వజ్రాలు (వీటి విలువ.5 కోట్లు)ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు రూ.500 కోట్ల ఆదాయానికి పన్ను ఎగవేసినట్లు గుర్తించారు.

అక్రమ సొమ్ముతో కల్కీ కుటుంబ సభ్యులు విదేశాల్లో కంపెనీలు స్థాపించారని అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనా, యూఏఈ, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. మనీ లాండరింగ్, హవాలా, పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో కల్కి ఇన్ని ఆస్తులను కూడబెట్టినట్టు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

ఐటీ అధికారుల దాడులతో కల్కి దంపతులు అజ్ఞాతంలొకి జారుకున్నట్టు సమాచారం. వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో ప్రధాన నిర్వాహకులైన లోకేష్ దాసాజీ,శ్రీనివాస్ దాసాజీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం కల్కి ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆశ్రమ పేరును తరుచూ మార్చడానికి కారణాలేంటన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ట్రస్టు ఆస్తులు,బినామీలు,భూములకు సంబంధించిన పత్రాలతో కూడిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, కల్కి భగవాన్ అసలు పేరు విజయకుమార్ నాయుడు. గతంలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేసిన విజయకుమార్.. కొన్నేళ్ల తర్వాత చిత్తూరులో జీవాశ్రమ్ పేరుతో రెసిడెన్షియ్ల్ స్కూల్ నిర్వహించారు. ఆ తర్వాత తనకు తానుగా మహావిష్ణు అవతారమని ప్రకటించుకొని కల్కి భగవాన్‌గా మారిపోయారు. 1990ల్లో తమిళనాడుతో పాటు ఏపీలో చాలా ఫేమస్ అయ్యారు కల్కి. లక్షలాది మంది ప్రజలు ఆయనకు భక్తులుగా మారి..పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. తన దర్శనానికి వచ్చే భక్తుల నుంచి రూ.5వేల నుంచి 25వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...