పోలీసుల వేట.. విదేశాలకు పారిపోయిన స్వామి నిత్యానంద..

స్వామి నిత్యానంద (Twitter/@vishal185526203)

నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన అనుచరులైన సాధ్వీ ప్రణప్రియానంద,ప్రియతత్వ రిద్ది కిరణ్ అనే మహిళలు ఇద్దరు పిల్లలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు.

  • Share this:
    వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి దేశం వదిలి విదేశాలకు పారిపోయాడని గుజరాత్ పోలీసులు తెలిపారు.ఓ రేప్ కేసులో నిత్యానందపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడని అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అసారి చెప్పారు. నిత్యానందకు ఎక్కడికి పారిపోయి ఉంటాడో తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను గుజరాత్ పోలీసులు కోరారు. అయితే హోంమంత్రిత్వ శాఖ మాత్రం గుజరాత్ పోలీసులు నంచి అధికారికంగా తమకెలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపింది. ప్రస్తుతానికైతే నిత్యానందకు సబంధించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది.

    కాగా, నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన అనుచరులైన సాధ్వీ ప్రణప్రియానంద,ప్రియతత్వ రిద్ది కిరణ్ అనే మహిళలు ఇద్దరు పిల్లలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు.మొత్తం నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసి.. వారిని ఓ ఇంట్లో నిర్బంధించారని పోలీసులు తెలిపారు. వారిని బాల కార్మికులుగా మార్చి ఆశ్రమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారని చెప్పారు. ఆ నలుగురు పిల్లలకు విముక్తి కల్పించామని.. వారి వాంగ్మూలం ఆధారంగానే నిత్యానందపై కేసులు నమోదు చేశామని తెలిపారు.కేసులో కీలక నిందితుడైన నిత్యానంద ఇండియాకు తిరిగి రాగానే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
    Published by:Srinivas Mittapalli
    First published: