Home /News /national /

GOATS CARRYING TRUCK ACCIDENT IN VIDISHA MADHYA PRADESH LOCALS STEAL GOATS AND LEAVES DRIVER TO DEATH SK

మేకల లారీ బోల్తా.. చావు బతుకుల్లో డ్రైవర్.. జనాలు ఏం చేశారో తెలుసా? ఇంత కన్నా దారుణం ఉండదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Goats Truck Accident: ఓ వైపు లారీ డ్రైవర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే అతడిని కాపాడకుండా.. మేకలను ఎత్తుకెళ్తారా.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని.. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.

    మేకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. కొన్ని మేకలు రోడ్డుపై పడి చనిపోయాయి. మరికొన్ని గాయపడ్డాయి. ఐతే బోల్తా పడిన లారీ కిందపడి డ్రైవర్ కూడా చితికిపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల స్థానికులు వచ్చారు. లారీ కింద పడిందని.. పరుగు పరుగున చేరుకున్నారు. కానీ వారు ఏం చేశారో తెలుసా..? అయ్యో పాపం అని..ఆ లారీ డ్రైవర్‌ని కాపాడలేదు. కాళ్లు, చేతులు విరిగి హాహా కారాలు చేస్తున్నా అతడిని ఏ మాత్రం పట్టించుకోలేదు. వారి దృష్టంతా ఆ మేకలపైనే ఉంది. మేకల పట్టుకుని అక్కడి నుంచి ఉడాయించారు. కానీ ఏ ఒక్కరూ లారీ డ్రైవర్‌ని కాపాడే ప్రయత్నం చేయలేదు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

    Wife And Husband: ముహూర్తం సరిగా లేదని.. 11 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్న భార్య.. ఆమె తల్లి..

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురి నుంచి ఓ లారీ 100 మేకలతో బుధవారం హైదరాబాద్‌కు బయలుదేరింది. సిరోంజ్ జిల్లా కంకర్‌ఖేడీ ప్రాంతానికి చేరుకోగానే.. ఆ లారీ అదుపు తప్పి, లోయలో పడిపోయింది. ప్రమాదం గురించి తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి పరుగులు పెట్టారు. చెల్లాచెదురుగా పడిపోయిన మేకలను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. కొందరైతే నాలుగైదు మేకలను పట్టుకెళ్లారు. కొందరైతే ఆటోలు తీసుకొచ్చి అందులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. కానీ లారీ కింద పడిన డ్రైవర్ సచిన్‌ కాటిక్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కాపాడమని కేకలు వేసినా వినిపించుకోలేదు. వారి దృష్టంతా మేకలపైనే ఉంది తప్పా..డ్రైవర్‌ను కాపాడాలన్న మానవత్వం ఎవరిలోనూ కనిపించలేదు.

    గన్‌ కల్చర్‌కి ఆ దేశం ఫేమస్..4రోజుల్లో ఎంత మంది చనిపోయారో తెలుసా..?

    కాసేపటికి పోలీసులు కూడా చేరుకున్నారు. మేకలను తీసుకెళ్తున్న స్థానికులను వారించారు. ఐనా వారు పట్టించుకోకుండా.. మేకలను ఎత్తుకెళ్లారు. పోలీసులు ఆ లారీ డ్రైవర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమయింది. సకాలంలో ఎవరూ స్పందించకపోవడంతో ఘటనా స్థలంలోనే అతడు కన్నుమూశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మేకలను దొంగిలించిన స్థానికుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ వార్త గురించి తెలిసిన నెటిజన్లు అయ్యో పాపం అని కామెంట్స్ పెడుతున్నారు. మనుషుల్లో మానవత్వం చనిపోయిందనడానికి ఇదే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు లారీ డ్రైవర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే అతడిని కాపాడకుండా.. మేకలను ఎత్తుకెళ్తారా.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని.. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Madhya pradesh, Road accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు