హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పర్యాటకులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

పర్యాటకులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

పర్యాటకులు అనుమతి పొందిన హోటల్స్‌లో మాత్రమే వసతికి ఏర్పాట్లు చేసుకోవాలని, దానికి సైతం ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. అనుమతి లేని హోటల్స్ అతిథ్యం ఇవ్వకూడదని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.

    పర్యాటకు ప్రియులకు గోవా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా పర్యాటక రంగం స్థంభించిపోయింది. అయితే పర్యాటకం అనగానే గుర్తొచ్చే పేరు మొదటగా గోవానే. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఆ రాష్ట్రప్రభుత్వం పర్యాటకులను ఆ రాష్ట్రంలోకి అనుమతించలేదు. దీంతో గత నాలుగు నెలలుగా పర్యాటకులు లేక గోవా బోసిపోయింది. అయితే నేటి నుంచి గోవా పర్యాటకానికి అనుమతిస్తున్నట్టు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గనోగర్ ప్రకటించారు. 250 హోటళ్లకు సైతం అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక శాఖ నుంచి అనుమతి పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నామని, అయితే పర్యాటకులు అనుమతి పొందిన హోటల్స్‌లో మాత్రమే వసతికి ఏర్పాట్లు చేసుకోవాలని, దానికి సైతం ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు.

    అనుమతి లేని హోటల్స్ అతిథ్యం ఇవ్వకూడదని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. పర్యాటకులు గోవాకు వచ్చే సమయంలో కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ ధ్రువపత్రంతోనే రావాలని, లేనిపక్షంలో రాష్ట్ర సరిహద్దుల్లోని పరీక్షా కేంద్రం వద్ద టెస్టులు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉండాలని వివరించారు. పాజిటివ్‌గా తేలితే పర్యాటకులను వారి స్వస్థలాలకు పంపించేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అవసరమైతే వారు కోలుకునే వరకు గోవాలోనే వైద్యం అందిస్తామని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.

    First published:

    ఉత్తమ కథలు