హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress MLAs join BJP: బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు.. ఇది అనూహ్యం.. మామూలు ట్విస్ట్ కాదు..

Congress MLAs join BJP: బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు.. ఇది అనూహ్యం.. మామూలు ట్విస్ట్ కాదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

8 congress MLAs join BJP: కాంగ్రెస్ పార్టీలో మూడింట రెండింతల మంది ఇప్పుడు బీజేపీలో చేరడంతో.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారు అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  గోవా రాజకీయాల్లో (Goa Politics) సంచలనం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరారు. వీరిలో మాజీ సీఎం కూడా ఉన్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తో జోష్ మీదున్న కాంగ్రెస్‌కు... ఇది పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి. గోవాలో కాంగ్రెస్‌ (Goa Congress)కు 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 8 మంది హ్యాండించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant) సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల్లో.. మాజీ సీఎం దిగాంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలీలా లోబో, రాజేష్ ఫల్దేశాయి, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ ఉన్నారు. ఈ సందర్భంగా మైఖేల్‌ లోబో మాట్లాడుతూ... ప్రధాని మోదీ, సీఎం ప్రమోద్‌ సావంత్‌ను మరింత బలోపేతం చేసేందుకు బీజేపీలో చేరామని చెప్పారు. 'క్విట్ కాంగ్రెస్, జోడో బీజేపీ' అని ఆయన నినదించారు.

  వాస్తవానికి ఇప్పుడు గోవాలో అసెంబ్లీ సమావేశాలు లేవు. ఐనప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం స్పీకర్‌ను కలవడంతో.. వారు బీజేపీలో చేరారని ప్రచారం మొదలయింది. ఆ తర్వాత గోవాలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బుధవారం భారతీయ జనతా పార్టీలో విలీన ప్రతిపాదనను సమర్పించింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో అధికార పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సదానంద్ షెట్ తవనాడే ప్రకటించారు. ఆ తర్వాత కాసపటికే.. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశారు. కాంగ్రెస్‌ని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. సీఎల్పీని బీజేపీలో విలీనం చేశారు.

  కాంగ్రెస్ పార్టీలో మూడింట రెండింతల మంది ఇప్పుడు బీజేపీలో చేరడంతో.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారు అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. గోవాలో అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు 11 మంది సభ్యులు ఉండగా.. బిజెపికి 20 మంది ఉన్నారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ైతే ఇప్పుడు కాంగ్రెస్‌కు 8 మంది గుడ్‌ బై చెప్పడంతో.. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలే మిగిలారు. 2019లో కూడా ఇదేవిధంగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Goa, National News

  ఉత్తమ కథలు