GOA MAIN PARTIES STARTED ELECTION CAMPAIGN FOR ASSEMBLY ELECTIONS EVK
Goa : "వేడెక్కుతున్న గోవా తీరం".. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు
గోవా అసెంబ్లీ
Goa : మరో నాలుగు నెలల్లో గోవా (Goa) అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం మొదలు పెట్టాయి. అప్పుడే ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకోవడం మొదలు పెట్టారు.
మరో నాలుగు నెలల్లో గోవా (Goa) అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం మొదలు పెట్టాయి. అప్పుడే ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకోవడం మొదలు పెట్టారు. గోవా (goa) అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) బరిలో నిలుస్తుండటం తెలిసిందే. అక్కడ మూడు రోజుల పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress) , బీజేపీ (BJP)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం గోవాలో పర్య టిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్య క్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొం తసేపు బైక్‌పై తిరిగారు. రోడ్డు పక్క న ఉన్న దాబాలో భోజనం చేశారు.
కాంగ్రెస్‌పై మమత విసుర్లు..
రాజకీయాలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవడం లేదని తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ చేతగానితనం కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ మరింత శక్తివంతమవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. త్రిపుర, గోవా, మేఘాలయతో పాటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీ పోటీచేసే అంశాన్ని టీఎంసీ పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కాంగ్రెస్‌కు పెద్ద సమస్య రాహుల్ గాంధీయేనంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా బెంగాల్ సీఎం కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు.
పర్యటనల్లో రాహుల్ గాంధీ..
గోవా ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడ పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే శనివారం బాంబూలిమ్ గ్రామంలో మత్స్య కారులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం ఆ తర్వా త గోవాలో ‘పైలట్’గా పిలిచే టూవీలర్ ట్యా క్సీ బం డిపై లిఫ్ట్ అడిగి ఆజాద్ మైదాన్ వరకు వెళ్లారు. ‘పైలట్’ డ్రైవర్ బైక్ నడుపుతుం డగా రాహుల్ వెనక కూర్చు ని దాదాపు 5 కిలోమీటర్లు బం డిపై ప్రయాణిం చారు. ఇం దుకు సం బం ధిం చిన ఫొటోలు, వీడియోలను కాం గ్రెస్ తమ అధికారిక ట్వి టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
విశ్వసనీయతే ముఖ్యం..
ప్రచారంలో భాగంగా రాహూల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో అం టే కేవలం వాగ్దానాలు మాత్రమే కాదని, విశ్వా సం తో కూడిన ఓ గ్యా రెం టీ అని రాహుల్ మత్స్య కారులతో అన్నా రు. తనకు విశ్వ సనీయతే ముఖ్యమని.. ఇతర రాజకీయ నేతల్లా కాదని.. తాను ఏదైనా చెప్పా నం టే అది తప్పకుం డా జరుగుతుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతు రుణాలు మాఫీ చేస్తామని.. అధికారంలోకి రాగానే చేశామని గుర్తు చేశారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.