Goa Lockdown: గోవాలో పూర్తిస్థాయి లాక్‌డౌన్... బాలీవుడ్ సినిమా, టీవీ షూటింగ్స్‌కి బ్రేక్

Goa Lockdown: గోవాలో పూర్తిస్థాయి లాక్‌డౌన్... బాలీవుడ్ సినిమా, టీవీ షూటింగ్స్‌కి బ్రేక్ (ప్రతీకాత్మక చిత్రం)

Goa Lockdown: మహారాష్ట్రలో లాక్‌డౌన్ పెట్టగానే... గోవాలో సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్స్ ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ కూడా లాక్‌డౌన్ వచ్చేసింది. మరి సినిమాల సంగతేంటి?

  • Share this:
    Goa Lockdown: దేశంలో ఒకటి తర్వాత ఒకటిగా... రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాష్ట్రాలు వేగంగా ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అని పిలుస్తుంటే... మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ అని పిలుస్తున్నాయి. గోవాలో కేసులు పెరిగిపోతుంటే... అక్కడి ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ ప్రకటించేసింది. ఐతే... దీన్ని లాక్‌డౌన్ అని పిలవట్లేదు కానీ... ఇది అలాంటిదే. మే 9 (ఆది వారం) నుంచి మే 23 వరకూ 15 రోజులపాటూ ఈ లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ అమలు చేస్తున్నామని తెలిపారు. తాజా లెక్కల ప్రకారం... గోవాలో నిన్న 4,195 పాజిటివ్ కేసులు వచ్చాయి. 56 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 31,716 ఉన్నాయి. అందుకే ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది.

    బాలీవుడ్ సినిమా ప్రపంచానికి ఈ ప్రకటన తలనొప్పిగా మారింది. మహారాష్ట్రలో లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు... చాలా మంది తమ షూటింగ్స్‌ని గోవాకి షిఫ్ట్ చేశారు. అక్కడ వీలైనంత త్వరగా షూటింగ్స్ పూర్తి చేసేసుకుంటే... ఎలాగొలా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనున్నారు. తీరా చూస్తే... కర్ఫ్యూతో ఇక అక్కడ షూటింగ్స్‌కి ఇవాళే చివరి రోజు అయ్యింది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్లు అమల్లో ఉన్నాయి.



    ఇది కూడా చదవండి: India Covid 19: ఇండియాలో మళ్లీ 4 లక్షలకు పైగా కొత్త కేసులు, 4వేలకు పైగా మరణాలు

    గోవాలో పాజిటివిటీ రేటు 41 శాతం ఉంది. ఢిల్లీ, ముంబైలో కంటే... ఇక్కడే ఇది ఎక్కువగా ఉంది. మరణాలు కూడా బాగా పెరిగాయి. మిగతా రాష్ట్రాల్లో లాగే... ఆక్సిజన్ కొరత, మందుల కొరత ఇక్కడ కూడా ఉంది. కర్ఫ్యూకి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రభుత్వం ఆదేశం శనివారం (నేడు) సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ప్రభుత్వం ప్రకటన కంటే ముందే... గోవాలోని ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ESG)... సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్స్‌ని రద్దు చేస్తూ... ప్రకటన చేసింది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ భవనాలు... ఎక్కడా కూడా షూటింగ్స్ జరపడానికి వీల్లేదని చెప్పేసింది. తిరిగి ఎప్పుడు అనుమతిచ్చేదీ... పరిస్థితిని బట్టీ నిర్ణయిస్తామని తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published: