Home /News /national /

GOA GOVERNMENT TO PROVIDE 3 FREE LPG CYLINDERS FROM JUNE END UMG GH

Free LPG Cylinders: ఆ రాష్ట్ర ప్రజలకు పండగే.. ఉచితంగా మూడు ఎల్పీజీ సిలిండర్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

గోవాలో ఉచితంగా మూడు ఎల్‌పీజీ సిలిండర్లు (ఫైల్)

గోవాలో ఉచితంగా మూడు ఎల్‌పీజీ సిలిండర్లు (ఫైల్)

గోవా (Goa) లోని బీజేపీ (BJP) ప్రభుత్వం పేదల కోసం ఉచిత పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు జూన్ చివరి నాటికి మూడు ఉచిత ఎల్‌పీజీ (LPG) సిలిండర్లను అందించాలని నిర్ణయించింది.

గోవాలోని బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఉచిత పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు జూన్ చివరి నాటికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లను అందించాలని నిర్ణయించింది. మూడు LPG సిలిండర్లకు అయ్యే నగదు మొత్తాన్ని అర్హత ఉన్న 37,000 కుటుంబాల బ్యాంక్ ఖాతాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వం జమ చేయనుంది.

పథకం అర్హుల వివరాలు
ఈ పథకానికి అర్హత పొందాలంటే గోవాలో నివసిస్తూ ఉండాలి. సదరు కుటుంబ ఆదాయం రూ. 4 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఈ పథకం గురించి గోవా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోవింద్ గౌడ్ మాట్లాడుతూ... ‘‘లబ్ధిదారులు ఎన్ని సిలిండర్లు తీసుకుంటున్నారో అధికారులు తనిఖీ చేస్తారు. సాధారణంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు సిలిండర్లు అవసరమవుతాయి. వాటిలో మూడు సిలిండర్ల కోసం నగదును మేం తిరిగి లబ్ధిదారులకు చెల్లిస్తాం.” అని మంత్రి తెలిపారు. ఈ పథకానికి రూ.36 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.



ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అనేక పథకాలను ప్రకటించింది. మూడు సంవత్సరాల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని హామీ ఇచ్చింది. అలాగే నాణ్యమైన హౌసింగ్ కోసం అర్హులైన కుటుంబాలకు చెందిన మహిళలకు 2 శాతం, పురుషులకు 4 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా అభివృద్ధి చేసిన నివాస స్థలాలు అందజేస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి పంచాయతీకి రూ.3 కోట్ల వరకు, ప్రతి మున్సిపాలిటీకి రూ.5 కోట్ల వరకు ఉమ్మడి అభివృద్ధి నిధులను మంజూరు చేయడానికి మనోహర్ పారికర్ కల్యాణ్ ఫండ్‌ను కూడా ప్రవేశపెడతామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరో అద్భుతానికి అమెరికా శ్రీకారం.. లార్జెస్ట్ సబ్‌మెరైన్ నిర్మాణంలో యూఎస్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?


ఇది ఇలా ఉంటే.. కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. సిలిండర్ డిపాజిట్‌ మొత్తాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ డిపాజిట్‌ ధర ప్రస్తుతం రూ.1,450 ఉండగా, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.2,200కు పెంచాయి. అలాగే 5 కిలోల సిలిండర్‌ డిపాజిట్ ధర ఇప్పటివరకూ రూ.800 ఉండగా.. తాజాగా రూ.1,150కు పెంచాయి. అలాగే సిలిండర్ రెగ్యులేటర్‌ ధరను కూడా పెంచాయి. రెగ్యులేటర్ కావాలనుకునే వారు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. అయితే ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవని ఇంధన సంస్థలు వెల్లడించాయి.
Published by:Mahesh
First published:

Tags: Bjp, Goa, LPG Cylinder, Lpg Cylinder Price

తదుపరి వార్తలు