Home /News /national /

GOA DELHI CM KEJRIWAL PROMISES TO FREE PILGRIMAGE FOR GOA PEOPLE EVK

Goa : మ‌మ్మ‌ళ్ని గెలిపించండి.. ఉచితంగా తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లండి!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)

Goa : మ‌రో నాలుగు నెల‌ల్లో గోవా (Goa) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు అప్పుడే ప్ర‌చారం మొద‌లు పెట్టాయి. ఈసారి స‌త్తా చాటాల‌నుకొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరు పెంచింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీ నర్‌ అరవిం ద్‌ కేజ్రీవాల్ తాము గెలిస్తే ఉచిత తీర్థ‌యాత్ర‌ల ప‌థ‌కం ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు.

ఇంకా చదవండి ...
    మ‌రో నాలుగు నెల‌ల్లో గోవా (Goa) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు అప్పుడే ప్ర‌చారం మొద‌లు పెట్టాయి. అప్పుడే ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఈ సారి బ‌రిలో ఆప్ (APP) కూడా ప్ర‌ధాన పోటీదారుగా నిల‌చేందుకు కృషి చేస్తుంది. గోవా ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు దీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీ ముఖ్య మం త్రి (Delhi Chief Minister), ఆప్‌ కన్వీ నర్‌ అరవిం ద్‌ కేజ్రీవాల్‌ గోవా ఎన్ని కలపై దృష్టి పెట్టారు. ప్ర‌జ‌ల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు ప్ర‌త్యేక హామీల‌ను ఇస్తున్నారు. గోవా ఎన్నిక‌ల (Goa Elections) నేప‌థ్యంలో ప‌లు స‌భ‌ల్లో పాల్గొన్న ఆయ‌న ఉచిత తీర్థ‌యాత్ర‌ల ప‌థ‌కం ప్ర‌వేశ‌పెడ‌తామి చెబుతున్నారు.

    అన్ని మ‌తాల వారీకి ఇస్తాం..
    రాష్ట్రం లో ఆప్ అధికారంలోకి వస్తే ప్రజలను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హామీ ఇచ్చా రు.

    GST-Petrol Price: ఇటు పెట్రోల్.. అటు జీఎస్‌టీ వ‌సూళ్లు.. కేంద్రానికి భారీగా ఆదాయం


    గోవాలోని హిందువులను అయోధ్యకు, క్రైస్తవులను వేలంకన్నికి, ముస్లింలను అజ్మీర్‌ షరీఫ్‌కు అలాగే.. సాయిబాబాను కొలిచే భక్తులను షిర్డికి ఉచితంగా తీసుకెళ్తామని ఆయ‌న హామీ ఇచ్చారు. ఆప్‌ అధికారం లోకి వస్తే ఉచిత విద్యు త్‌, యువతకు ఉద్యో గాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

    బ‌ల‌ప‌డేందుకు య‌త్నం..
    గోవాలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అక్క బ‌ల ప‌డేందుక తృణ‌మూల్, ఆప్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. రాజకీయాలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవడం లేదని తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ చేతగానితనం కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ మరింత శక్తివంతమవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. త్రిపుర, గోవా, మేఘాలయతో పాటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీ పోటీచేసే అంశాన్ని టీఎంసీ పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్‌కు పెద్ద సమస్య రాహుల్ గాంధీయేనంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా బెంగాల్​ సీఎం కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు.

    రాజ‌కీయ శక్తిగా ఎదిగేందుకు కృషి..
    దేశ వ్యాప్తంగా తృణ‌మూల్ కాంగ్రెస్ బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ గోవాలో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకొంది. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు ప్ర‌ధానంగా తృణ‌మూల్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కారణం గానే మోదీ శక్తిమం తులు అవుతున్నారంటూ గోవా పర్య టనలో మమత బెన‌ర్జీ  (Mamata Banarjee) కామెంట్లు ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని మ‌రింత పెంచాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Aravind Kejriwal, Congress, Goa, TMC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు