Home /News /national /

GOA CM TRYING TO DISCOURAGE TIKTOK PUBG AMONG STUDENTS MK

Tik Tok ban: గోవా ప్రభుత్వం సంచలన నిర్ణయం...టిక్ టాక్, పబ్ జీలపై తల్లిదండ్రులకు సర్క్యులర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tik Tok ban: పసిపిల్లల మానసిక ప్రవర్తన దుష్ప్రభావాలు చూపిస్తున్న ఈ యాప్స్ విషయంలో తల్లిదండ్రుల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతే కాదు మేరకు రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ తల్లిదండ్రులు, అలాగే పిల్లల సంరక్షకులకు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది.

ఇంకా చదవండి ...
    టిక్ టాక్, పబ్‌జీ గేమ్ యాప్స్‌ను పిల్లలు డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త పడాలని గోవా ప్రభుత్వం తల్లిదండ్రులకు సూచించింది. పసిపిల్లల మానసిక ప్రవర్తన దుష్ప్రభావాలు చూపిస్తున్న ఈ యాప్స్ విషయంలో తల్లిదండ్రుల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతే కాదు మేరకు రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్  తల్లిదండ్రులు, అలాగే పిల్లల సంరక్షకులకు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. సదరు యాప్స్ వల్ల పిల్లలపై చెడు ప్రభావాలు పడుతున్నాయని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా అనేక మంది ఈ యాప్ప్ వాడకం ద్వారా ప్రాణాలకు సైతం తెగించిన నేపథ్యంలో గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే గోవా అసెంబ్లీలో టిక్‌టాక్, పబ్‌జీ గేమ్ యాప్‌లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి నాయక్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమాధానం ఇచ్చారు. ఈ యాప్స్ వల్ల వచ్చే ప్రమాదాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ తరపున సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు.
    First published:

    Tags: PUBG, Tik tok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు