Cancer Patient Enjoys last party : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమా గుర్తుందా?ఆ సినిమాలో ఓ మెడికల్ కాలేజీలో పేషెంట్లు,సిబ్బంది సహా అందరినీ సంతోషంగా ఉంచేందుకు చిరంజీవి చేసే పనులు నవ్వు తెప్పించడమే కాకుండా కళ్లల్లొ నీళ్లు కూడా తెప్పిస్తాయి. సినిమాలో..ఓ క్యాన్సర్ పేషెంట్ చివరిదశలో ఉన్నాడని తెలిసి అతడి సంతోషంగా ఉంచడానికి చిరంజీవి ప్రయత్నిస్తాడు. చిరంజీవి చేసే పనికి ఆ క్యాన్సర్ పేషెంట్ కి తిరిగి జీవితం మీద ఆశ కలుగుతుంది..అయినా కూడా చివరిదశలొ తనకు సంతోషానిచ్చిన చిరంజీవికి థ్యాంక్స్ చెబుతూ కన్నుమూస్తాడు ఆ క్యాన్సర్ పేషెంట్. అయితే ఇప్పుడు రియల్ గా కూడా గోవాలో ఇలానే జరిగింది. గోవాలో ఓ క్యాన్సర్ పేషెంట్(Goa Cancer Patient) తన చివరికోరికను తీర్చుకుని కొన్ని గంటల్లోనే చనిపోయిన ఘటన ఇప్పుడు అందరి కళ్లల్లొ కన్నీళ్లు వచ్చేలా చేస్తోంది.
గోవాలోని కంచిలిమ్ నివాసి అయిన ఆష్లే నోర్హానా(Ashley Noronha) అనే యువకుడు అంజునా హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారినపడ్డాడు. గోవా మెడికల్ కాలేజీలోని ఆంకాలజీ టీమ్ ద్వారా ట్రీట్మెంట్ పొందుతూ కూడా ఉద్యోగం చేశాడు కొద్దిరోజులు. అయితే క్యాన్సర్ చివరి స్టేజీకి వెళ్లింది. గోవాలోని లొటోలిమ్(Loutolim)లో శాంతి ఆవేదన సదన్ అనే క్యాన్సర్ పేషెంట్లకు సేవలందించే ప్రముఖ హాస్పిక్(Shanti Avedna Sadan) లో 28ఏళ్ల ఆష్లే నోర్హానా చివరి స్టేజీ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. అయితే రోజూ తన చుట్టూ ఉండే వాతావరణం,ఇంజెక్షన్లు,ట్యాబెట్లు చూసి అతడికి ఓ రకమైన బాధ కలిగింది. ఎలాగొ తాను చనిపోతాను అని తెలుసుకున్న ఆష్లే తన లైఫ్ ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు, దీంతో ఈ విషయాన్ని తనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో సహాయమందిస్తున్న సాబర్కేర్ ట్రస్ట్(Sabrcare trust)సభ్యులకు తెలియజేశాడు. ఈ విషాద మొఖాలను చూడలేకపోతున్నానని,అందరూ తన లైఫ్ ని సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటలను ఆష్లే తమకు చెప్పాడని సాబర్కేర్ ట్రస్ట్ ఫౌండర్ లౌడ్రస్ సోరెస్ తెలిపారు. చాలామంది తాము చనిపోతున్నాం అని బాధపడి కుంగిపోతుంటారని..అయితే ఇదొక యూనిక్ రిక్వెస్ట్ అని సోరెస్ తెలిపారు.
సమయం తక్కువగా ఉండటంతో వెంటనే శాంతి ఆవేదన సదన్ సభ్యులు గత నెల మూడోవారంలో అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ల నుంచి పర్మిషన్ తీసుకొని ఓ ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆఫ్లే బెడ్ చుట్టూ పార్టీ వాతావారణం తలపించేలా బెలూన్స్ తో డెకరేట్ చేశారు. బెలూన్లు, కచేరీ, సంగీతం, చిప్స్, కేక్ తో అతడి చుట్టూ పార్టీ వాతావరణాన్ని క్రియేట్ చేశారు.అదనపు ఆక్సిజన్ కోసం నాజల్ కానులా పెట్టుకొని ఉన్న ఆష్లే..తాను అందంగా కనిపించాలనుకుంటున్నానని తనకు షేవింగ్ చేసి మేకప్ టచ్ చేయాలని కోరడంతో నిర్వాహకులు అతడు కోరినట్లుగానే చేశారు. అక్కడికి వచ్చిన తన స్నేహితులు,కుటుంబసభ్యులు తనకు సేవలందిస్తున్న సిబ్బందితో సరదాగా జోక్స్ వేస్తూ ఆనంద క్షణాలు గడిపాడు ఆష్లే.
అంతేకాకుండా తనకు సాధారణ బర్త్ డే పాటలు వద్దని పాప్ మ్యూజిక్ వినాలని ఉందని ఆష్లే చెప్పడంతో అది కూడా ఏర్పాటు చేశారు. క్యాన్సర్ కంటే ముందే విషాద పాటలు తనను చంపేసేలా ఉన్నాయంటూ సరదాగా జోక్స్ వేశాడు ఆష్లే. అతడు తనకి రమ్,కోక్ కావాలని అడిగాడు. అయితే డాక్టర్ రమ్ వద్దని చెప్పడంతో అది ఇవ్వలేదు. అయితే అందరితో ఆష్లే ఇలా సరదాగా గడపుతున్న సమయంలో ఇక మీరు వెళ్తే అతడు విశ్రాంతి తీసుకుంటాడు అని డాక్టర్లు కుటుంబసభ్యులు,ఫ్రెండ్ అందరినీ పంపించారు. అప్పటికీ ఆష్లేకి వాళ్లందరూ తనతో ఉంటే బాగుండు అని అనుకుంటున్నాడు.
పార్టీ జ్ణాపకాలతో ఆ రాత్రి నిద్రపోయిన ఆష్లే..తెళ్లవారి తిరిగి కళ్లు తెరవలేదు. తెల్లవారుఝామున 3.25 గంటల సమయంలో ఆష్లే తుదిశ్వాస విడిచాడు. ఈ ఫేర్ వెల్ పార్టీ తమకు కొత్తగా అనిపించిందని,ఆష్లే చాలా సంతోషంగా,ప్రశాంతంగా చనిపోయాడని శాంతి ఆవేదనలో పనిచేసే సిస్టర్స్ తెలిపారు. కొద్దిసేపు అసౌకర్యంగా ఫీల్ అయ్యాడని..అయినా ఆ విషయం ఆష్లే తమకు చెప్పలేదని తెలిపారు. అతడికి వారి కుటుంబసభ్యులు తెచ్చిన మంచి డ్రెస్ ని వేశాం అని అందులో అతడు మంచి అందగాడిలా కనిపించాడని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.