
IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్సీటీసీ నుంచి టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)
పెళ్లయిన ఓ కొత్తజంట హనీమూన్ కోసం మలేషియాకు వెళ్లింద. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఎయిర్పోర్టు సిబ్బంది కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా అక్కడే ఆపేశారు. దీంతో గత ఐదురోజులుగా విమానాశ్రయంలోనే ఇబ్బందులు పడుతున్నారు.
ఓ కొంత జంట హానీమూన్ కోసమని మలేషియా వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో ఎయిర్పోర్టు సిబ్బంది వారిని అక్కడే ఆపేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన శంకర హల్దార్(28), పల్లవి మిశ్రా(27)లకు ఫిబ్రవరి 27న పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం హనీమూన్ కోసం ఆ కొత్త జంట మలేషియాకు వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే క్రమంలో ఈనెల 17న కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మలేషియా ఎయిర్లైన్స్ సిబ్బంది వారిని అక్కడే ఆపేసింది. దీంతో వారు తమ ఇంటికి చేరుకోలేకపోయారు. ఫలితంగా గత ఐదు రోజులుగా తమ అవసరాలు తీర్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మలేషియా విమానాశ్రయంలో కేవలం ఈ కొత్తజంటే కాకుండా మరో 200 మంది ఇండియన్స్ చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
Published by:Narsimha Badhini
First published:March 22, 2020, 14:59 IST