Home /News /national /

GIVING WINGS TO DREAMS WHOS CAPTAIN ABHILASHA BARAK FIRST WOMAN COMBAT PILOT IN ARMY AVIATION GH VB

Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్‌లో తొలి మహిళా కంబాట్ పైలట్‌గా రికార్డు.. అసలు ఎవరీమె..? తెలుసుకోండి..

వింగ్స్ బ్యాడ్జీల ప్రదానోత్సవంలో బరాక్

వింగ్స్ బ్యాడ్జీల ప్రదానోత్సవంలో బరాక్

హర్యానాకు చెందిన 26 ఏళ్ల అభిలాష బరాక్ (Abhilasha Barak) చరిత్ర సృష్టించారు. బుధవారం నాడు ఆమె ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ ఉమన్‌ కంబాట్‌ ఏవియేటర్‌ (First Woman Combat Aviator Of The Indian Army)గా అవతరించారు.

హర్యానాకు చెందిన 26 ఏళ్ల అభిలాష బరాక్ (Abhilasha Barak) చరిత్ర సృష్టించారు. బుధవారం నాడు ఆమె ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ ఉమన్‌ కంబాట్‌ ఏవియేటర్‌ (First Woman Combat Aviator Of The Indian Army)గా అవతరించారు. నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తాజాగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఆమెకు 36 మంది ఆర్మీ పైలట్‌లతో పాటు గౌరవనీయమైన 'వింగ్స్' బ్యాడ్జీలు ప్రదానం చేశారు. దేశంలోనే తొలి మహిళా(Women) యుద్ధ పైలట్‌గా చరిత్రకెక్కిన అభిలాష ఇండియన్(Indian) దళాలలో చేరాలని చిన్నతనం నుంచే అనుకునేవారు. నాన్న మిలటరీ ఆఫీసర్ అవడంతో ఆమె బాల్యం దేశవ్యాప్తంగా ఒక సైనిక కంటోన్మెంట్(Cantonment) నుంచి మరొక సైనిక కంటోన్మెంట్‌కు వెళ్లడంతోనే సరిపోయింది. అభిలాష గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో కంబాట్‌ ఏవియేటర్‌గా చేరిన మొదటి మహిళా అధికారిగా కెప్టెన్ బరాక్ నిలిచారని ఒక అధికారి తెలిపారు. సెప్టెంబరు 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్‌లో బరాక్ నియమితులయ్యారు. అభిలాష తన అన్నయ్యను చూశాకే దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 2013లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో అభిలాష అన్నయ్య ఉత్తీర్ణత సాధించారు. ఆయన ఆర్మీ పరేడ్‌లో పాల్గొన్నప్పుడు చూసిన అభిలాషకు సైన్యంలో చేరాలనే తన సంకల్పం మరింత ధృఢపడింది.

Upcoming Cars: జూన్‌లో మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు.. కార్ లవర్స్‌ను ఆకర్షిస్తున్న మోడల్స్ ఇవే..


కెప్టెన్ అభిలాష సనావర్‌లోని లారెన్స్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆమె 2016లో ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం యూఎస్ఎలోని డెలాయిట్‌ కంపెనీలో ఉద్యోగిగా పని చేశారు. 2018లో ఆమె చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా ఇండియన్ ఆర్మీలో చేరారు. కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌తో ఆమెకు చక్కటి అనుబంధం ఉంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌ కార్యక్రమంలో పాల్గొన్నగా దానికి కంటింజెంట్ కమాండర్‌గా అభిలాషని కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌ అధికారులు ఎంపిక చేశారు.

“2018లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి నా శిక్షణను పూర్తి చేసిన తర్వాత, నేను ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌ని ఎంచుకున్నాను. అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు నేను కేవలం గ్రౌండ్ డ్యూటీకే పరిమితమవుతానని నాకు తెలుసు. అయినా నేను పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్‌కు అర్హత సాధించానని అప్లికేషన్‌లో పేర్కొన్నాను. భారత సైన్యం మహిళలను యుద్ధ పైలట్‌లుగా చేర్చే రోజు ఎంతో దూరంలో లేదని నాకే అప్పుడే తెలుసు." అని ఓ ఇంటర్వ్యూలో అభిలాష చెప్పుకొచ్చారు.

అభిలాష తండ్రి కల్నల్‌ ఎస్‌ ఓం సింగ్‌ 2011లో మిలటరీ సర్వీసుల నుంచి పదవీ విరమణ చేశారు. తన తండ్రి గురించి ఒక విషయం ఆమె అందరితో పంచుకున్నారు. “చాలా మందికి ఒక విషయం తెలియదు. అదేంటంటే 1987లో ఆపరేషన్ మేఘదూత్ సమయంలో, మా నాన్న అమర్ పోస్ట్ నుంచి బనా టాప్ పోస్ట్ వరకు పెట్రోలింగ్ పార్టీకి నాయకత్వం వహించారు. ప్రతికూల వాతావరణం కారణంగా, అతను సెరిబ్రల్ ఒడెమా బారిన పడ్డారు. తీవ్రమైన అనారోగ్యంతో అమర్ పోస్ట్‌కి మళ్లీ తిరిగి వచ్చేశారు. అక్కడ నుంచి మా నాన్నాని ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌ సరైన సమయానికి సేఫ్ ప్లేస్‌కు తీసుకొచ్చారు. అందుకే ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌కి మా నాన్న జీవితాంతం రుణపడి ఉంటారు. నేను కూడా!" అని అభిలాష చెప్పుకొచ్చారు.

Axis Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్.. సర్వీస్ ఛార్జీలు భారీగా పెంపు.. కొత్త ఛార్జీల వివరాలు..


భారత వైమానిక దళం, భారత నౌకాదళంలోని మహిళా అధికారులు చాలా కాలంగా హెలికాప్టర్లను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైన్యం 2021 ప్రారంభంలో తమ విమానయాన విభాగం (Aviation Wing)లో కూడా ఆడవారికి అనుమతిచ్చింది. ఇప్పటి వరకు ఆర్మీ ఏవియేషన్‌లో మహిళా అధికారులకు గ్రౌండ్‌ డ్యూటీలు మాత్రమే కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఎంత పైలట్లుగా కూడా నియమిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: First women, India, Indian Army, Indian Navy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు