మద్యం దుకాణానికి కొబ్బరికాయ కొట్టి.. హారతులిచ్చి.. ఓ మందుబాబు ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మందుబాబు అయితే ఏకంగా మద్యం దుకాణానికి కొబ్బరి కాయ కొట్టి హారతులిచ్చాడు. తన కష్టాలు తీర్చంటూ దేవుడికి ఒక్క రోజైనా పూజ చేశాడో ఏమో తెలియదు గానీ మద్యం దుకాణానికి పూజ చేయడంతో స్థానికులంతా ఆశ్చర్యపోయారు.

  • Share this:
    ‘రేపట్నుంచి మద్యం దుకాణాలు ఓపెన్’.. అన్న ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చిందో లేదో.. మందుబాబుల ప్రాణాలు మాత్రం లేచొచ్చాయి. అబ్బ ఆ మాట వినగానే చెవుల్లో అమృతం పోసినట్టు అన్పించిందంటూ మందుబాబులు ఎగిరి గంతేస్తున్నారు. ఓ మందుబాబు అయితే ఏకంగా మద్యం దుకాణానికి కొబ్బరి కాయ కొట్టి హారతులిచ్చాడు. తన కష్టాలు తీర్చంటూ దేవుడికి ఒక్క రోజైనా పూజ చేశాడో ఏమో తెలియదు గానీ మద్యం దుకాణానికి పూజ చేయడంతో స్థానికులంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కర్నాటకలోని బంగారుపేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటకలోని బంగారుపేట తాలూకా బుదికోటలో ఉన్నమద్యం షాపు వద్ద ఓ వ్యక్తి కొబ్బరికాయ కొట్టి హారతుళ్లివ్వడంతో చూసినోళ్లంతా తెగ నవ్వుకున్నారు. కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అన్ని మద్యం షాపులు బంద్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

    ఇక అప్పట్నుంచి మందు బాబుల కష్టాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మందు కోసం మందుబాబుల పాడే పాట్లు అన్నీఇన్నీకావు. ఇలాంటి సమయంలో వైన్ షాపులు తెరుస్తారని వార్తలు రావడంతో సంతోషం పట్టలేక మందు బాబులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ వార్త వినగానే మందుబాబుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆలయంలో దేవుడికి పూజలు చేసినట్టు మద్యం దుకాణానికి కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో హారతులిస్తోన్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
    Published by:Narsimha Badhini
    First published: