Indian Railways : రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ‘రాయితీని వదులుకోండి.’

Indian Railways | గతంలో కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీని వదులుకోవాలంటూ పిలుపునిచ్చింది. దానికి పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారు.

news18-telugu
Updated: July 18, 2019, 5:09 PM IST
Indian Railways : రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ‘రాయితీని వదులుకోండి.’
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
రైల్వేను బలోపేతం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అదే ‘#GiveUpConcession.’ అంటే మీకు వచ్చే రాయితీని వదులుకోవడం. ప్రస్తుతం రైల్వేలో 60 ఏళ్లు పైబడిన పురుషులకు ఏ తరగతిలో అయినా ప్రయాణం చేసేందుకు టికెట్ ధరలో 40 శాతం రాయితీ కల్పిస్తుంది. అదే మహిళల విషయానికి వస్తే.. 58 ఏళ్లు దాటిని వారికి 50 శాతం రాయితీ అందిస్తుంది. వారు ఎన్నిసార్లు, ఏ క్లాస్‌లో ప్రయాణం చేసినా.. ఈ రాయితీ వర్తిస్తుంది. దీని వల్ల రైల్వేలకు భారం కానుంది. కాబట్టి, స్థోమత ఉన్నవారు తమ రాయితీని వదులుకోవాల్సిందిగా కోరుతూ దక్షిణ మధ్య రైల్వే క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన తెచ్చింది. అయితే, అప్పటి నుంచి పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకునేవారు, ఆన్‌లైన్లో బుక్ చేసుకునే వారు కూడా ఇలా రాయితీని వదులుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

రాయితీని వదులుకోవాలంటూ దక్షిణ మధ్య రైల్వే ప్రచారం


గతంలో కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీని వదులుకోవాలంటూ పిలుపునిచ్చింది. దానికి పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారు. స్థోమత కలిగిన వారు రాయితీని వదులుకున్నారు. దీంతో మరింత మందికి గ్యాస్ అందించేందుకు వీలు కుదిరింది. ఈ క్రమంలో అలాంటి స్కీమ్‌ను రైల్వేల్లో కూడా ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. రాయితీని వదులుకున్న వారు టికెట్ పూర్తి ధరను చెల్లించాల్సి ఉంటుంది. రైల్వేలను ఆధునీకరించడానికి భారీగా నిధులు అవసరం. నిధుల సమీకరణలో భాగంగా ఇలాంటి క్యాంపెయిన్‌తో ముందుకొచ్చింది.
First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading