GIVE MY PIGEON RETURN REQUESTED PM A PAKISTANI MAN VS
pigeon case: పావురం కేసు.. అది నాదే...ఇవ్వండి అంటూ ప్రధాని మోడికి... పాకిస్తానీ విజ్ఞప్తి
pigeon
పాకిస్థాన్ బోర్డర్ లో అనుమానంగా కనిపించిన ఓ పావురాన్ని ఇండియన్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే... అయితే..ఆ
పావురం తనదే అంటూ ఓ పాకిస్తాని యువకుడు వివరణ ఇచ్చాడు. పావురానికి ఎలాంటీ కోడ్స్ లేవని స్పష్టం చేశాడు.
పంజాబ్ బోర్డర్లో పావురం పెట్టిన కేసు మరో మలుపు తిరిగింది. గూడచార్యం గా అనుమానించి పావురం పై కేసు పెట్టిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆ పావురం తనదే అంటూ పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ప్రధాని మోడికి విజ్ఝప్తి చేశారు. అయితే దీనిపై భారత అధికారులు ఇంకా ఎలాంటీ స్పందన తెలపలేదు.
ఏప్రిల్ 17న పాకిస్తాన్ సరిహద్దు నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ బోర్డర్ వద్ద నీరజ్ కుమార్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ పావురం అతని భుజంపై వచ్చి వాలింది. అయితే.. ఆ పావురం కాళ్లకు ఏదో కట్టి ఉన్నట్లు గమనించిన కానిస్టేబుల్కు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పావురాన్ని పట్టుకుని, పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్కు సమాచారం అందించాడు.. అనుమానంతో అధికారులు పావురాన్ని స్కాన్ చేశారు. దీంతో పావురంలోపల ఒక తెల్ల కాగితం కనిపించగా, దానిపై ఒక సంఖ్య కూడా ఉన్నట్టు గుర్తించారు...దీంతో అది ఓ కోడ్ భాష లాంటిదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పావురాన్ని ఉగ్రవాదులు గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే అనుమానంతో పావురంపై అమృత్సర్ సమీపంలోని ఖహగ్ర పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే...పావురానికి కట్టిన కాగితంపై రాసి ఉంది తన ఫోన్ నెంబర్ అని సరిహద్దుకు సమీపంలోనే నివసించే హబీబుల్లా అనే వ్యక్తి ఈద్ పండగా సంధర్భంగా ఈ పావురాన్ని ఎగరవేశానని తెలిపాడు. భద్రతా దళాలు భావించినట్టుగా కాగితం మీద రాసి ఉంది ఫోన్ నంబర్ తప్ప ఎలాంటీ కోడ్ కాదని హబిబుల్లా స్పష్టం చేశాడు. దీంతో ఆ పావురాన్ని తిరిగి ఇప్పించాల్సిందిగా భారత ప్రధానికి విజ్ఞప్తి చేశాడు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.