కిలో చెత్తకు ఉచిత భోజనం.. అధికారుల వినూత్న ప్రయోగం

కిలో చెత్తకు ఉచిత భోజనం.. అధికారుల వినూత్న ప్రయోగం

గార్బెజ్ కేఫ్‌లో భోజనం చేస్తున్న దృశ్యం(Image : ANI/Twitter)

ఛత్తీస్‌గడ్‌లోని అంబికాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తాజాగా 'గార్బెజ్ కేఫ్' ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైనా కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి ఇస్తే.. ఉచితంగా లంచ్‌ ఆఫర్ చేస్తారు.

 • Share this:
  ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి కలిగే ముప్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నేళ్లయినా భూమిలో కలిసిపోని ప్లాస్టిక్‌తో మానవాళి మనుగడకే ముప్పు అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ప్లాస్టిక్ వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా దేశంలోని పట్టణాలు,నగరాల్లో వెలువడుతున్న చెత్తలో సగానికి పైగా ప్లాస్టిక్ ఉండటం గమనార్హం.ఈ నేపథ్యంలో చెత్త కుప్పల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ను తిరిగి ఉపయోగంలోకి తీసుకువచ్చి.. కొంతలో కొంతైనా పర్యావరణ ముప్పును తగ్గించేలా ఛత్తీస్‌గఢ్ అధికారులు భావించారు. ఇందుకోసం ఓ వినూత్న ఆలోచనను ముందుకు తెచ్చారు.

  ఛత్తీస్‌గడ్‌లోని అంబికాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తాజాగా 'గార్బెజ్ కేఫ్' ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైనా కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి ఇస్తే.. ఉచితంగా లంచ్‌ ఆఫర్ చేస్తారు.అరకిలో చెత్తను తీసుకొస్తే.. ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ ఆఫర్ చేస్తారు. అలా ఎంతోమందికి ఇప్పుడిక్కడ భోజనం దొరుకుతోంది. ఇందులో ఎక్కువగా చెత్త ఏరుకునేవారు,ఇల్లు లేని నిరాశ్రయులే ఉన్నారు. మున్ముందు వీరికి ఆవాసం కల్పించడం కూడా ఈ పథకంలో భాగమని అధికారులు చెబుతున్నారు. ఈ కేఫ్ ఏర్పాటు ద్వారా పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి పట్టణం శుభ్రంగా మారడంతో పాటు పేదలకు ఒకపూట భోజనం దొరుకుతుందని అంటున్నారు.
  గార్బెజ్ కేఫ్‌కు వచ్చే చెత్తను రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. స్వచ్చభారత్ పథకంలో భాగంగా దీన్ని చేపట్టినట్టు వెల్లడించారు.

  Published by:Srinivas Mittapalli
  First published: