• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • GIVE DIESEL WILL SEARCH YOUR DAUGHTER SAYS UP POLICE TO WOMAN IN KANPUR SRD

Give Diesel : డీజిల్ పోయించు..నీ కూతుర్ని వెతుకుతాం..ఓ తల్లికి పోలీసుల నిర్లక్ష్యపు సమాధానం

ప్రతీకాత్మక చిత్రం

Give Diesel : యూపీలోని కాన్పూర్ లో సరిగా నడవలేని ఓ అభాగ్యురాలిపట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను వెతికే విషయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై ఆ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    యూపీలోని కాన్పూర్ లో సరిగా నడవలేని ఓ అభాగ్యురాలిపట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన తన కుమార్తెను వెతికే విషయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై ఆ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతుర్ని వెతకాలంటే..పోలీసులు తమ వాహనాల్లో డీజిల్ పోయించమంటున్నారంటూ మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివరాల్లోకెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్ జిల్లాకు చెందిన ఓ దివ్యాంగురాలైన మహిళ తన కుమార్తె కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ బాలికను వెతికిపట్టుకోవడంలో పోలీసులు అలసత్వం వహిస్తుండటంతో..వారిపై కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారికి మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో కమిషనర్ కార్యాలయం వద్ద స్థానిక మీడియా ఎదుట తన వ్యథను వెళ్లగక్కారు. " మీ కుమార్తె కోసం వెతుకుతున్నాం అంటారు. కొన్నిసార్లు బయటకు నెట్టేస్తారు. నా కుమార్తెపై నిందలు వేస్తున్నారు. వారి వాహనాల్లో డీజిల్‌ నింపితే..బాలికను వెతుకుతామంటారు. నేను పోలీసులకు లంచం ఇవ్వలేదు. కానీ, డీజిల్ మాత్రం నింపించాను. అందుకోసం రూ.10 నుంచి 15 వేల వరకు అప్పు చేశాను. ఇలా ఎంతకాలం?" అని సదరు మహిళ వాపోయారు.

    తాను ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసు స్టేషన్‌లో ఒకరు మాత్రమే కాస్త సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే తన బంధువే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. కాగా, ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ మహిళ పేరు గుడియా. చేతి కర్రల సాయంతో నడుస్తున్న ఈమెకి కొద్దిపాటి సొంత భూమి ఉందని తెలిసింది. తాను ఎప్పుడు వెళ్లినా పోలీసులు తనను కులం పెట్టి దూషిస్తున్నారని వాపోయింది.

    గుడియా దీనస్థితికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈమె కేసును పరిష్కరించాలని, ఈమె కూతురిని ఈ తల్లికి అప్పగించాలని కాన్పూర్ పోలీసులను ఆదేశించారు. ఈ కేసుపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
    Published by:Sridhar Reddy
    First published: