ప్రేమ పెళ్లి చేసుకోం... అమరావతిలో కాలేజీ అమ్మాయిల ప్రతిజ్ఞ

‘నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రేమించను. ప్రేమ పెళ్లి చేసుకోను. అలాగే, కట్నం అడిగే వారిని కూడా పెళ్లిచేసుకోను.’ అంటూ యువతులు ప్రతిజ్ఞ చేశారు.

news18-telugu
Updated: February 14, 2020, 9:55 PM IST
ప్రేమ పెళ్లి చేసుకోం... అమరావతిలో కాలేజీ అమ్మాయిల ప్రతిజ్ఞ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘నాకు మా అమ్మానాన్నల మీద పూర్తి విశ్వాసం ఉంది. నా చుట్టూ జరిగే సంఘటనలకు నేను చలించను. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రేమించను. ప్రేమ పెళ్లి చేసుకోను. అలాగే, కట్నం అడిగే వారిని కూడా పెళ్లిచేసుకోను. ఒకవేళ సామాజిక పరిస్థితుల దృష్ట్యా నా తల్లిదండ్రులు నాకు కట్నం ఇచ్చి పెళ్లిచేస్తే... భవిష్యత్తులో ఓ తల్లిగా నేను నా కూతురికి ఎలాంటి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేస్తాను. ఏ మాత్రం కట్నం తీసుకోకుండా నా కోడలిని తెచ్చుకుంటాను. బలమైన, ఆరోగ్యవంతమైన భారత్ కోసం నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను.’ ఇది ఎవరో చేసింది కాదు. అమరావతిలోని ఓ మహిళా కాలేజీలో విద్యార్థినులు చేసిన ప్రతిజ్ఞ. అయితే, అది ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి కాదు. మహారాష్ట్రలోని అమరావతి.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉన్న మహిళా కళా వాణిజ్య మహావిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఆ కాలేజీ పరిపాలనా విభాగం ఈ మేరకు విద్యార్థినుల చేత ప్రతిజ్ఞ చేయించింది. నేషనల్ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా ఈ ప్రతిజ్ఞ చేయించారు. అయితే, పిల్లలు ప్రేమ పేరుతో దారి తప్పకుండా చదువు మీద దృష్టి పెట్టి, అది పూర్తయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించేలా చేయడానికే ఇలాంటి ప్రతిజ్ఞ చేయించినట్టు కళాశాల యాజమాన్యం చెబుతోంది.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు