హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: ప్రియుడ్ని గన్ కాల్చడం నేర్పించి... భర్తను చంపించిన భార్య... !

OMG: ప్రియుడ్ని గన్ కాల్చడం నేర్పించి... భర్తను చంపించిన భార్య... !

ప్రతీకాత్మక చిత్రం (News18 File Photo)

ప్రతీకాత్మక చిత్రం (News18 File Photo)

విషయం బయటకు తెలియడంతో పోలీసులు భార్యతో పాటు ప్రియుడ్ని కూడా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి3న మృతుడి భార్య శివాని అలియాస్ సీమ.. తన భర్త తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad | Uttar Pradesh

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. ఈ గటన ఘజియాబాద్ నందగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ బ్లాక్‌ లో 17 రోజులు కిందట కపిల్ చౌదరి అనే 43 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మొబైల్ రిపేర్ షాపు నడిపే 20 ఏళ్ల వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఆ ప్రియుడితోనే కపిల్ చౌదరిని భార్య హత్య చేయించింది. ప్రియుడితో కలిసి ఉందామనుకున్న భార్యకు భర్త అడ్డుగా నిలిచాడు. దీంతో ఆ అడ్డు తొలిగించేందుకు భర్తనే హత్య చేయించింది.

దీనికోసం భార్య స్వయంగా ప్రియుడికి తుపాకీ ఎలా షూట్ చేయాలో నేర్పించింది. ఈ ఘటనకు ముందు భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చింది భార్య. ఆ తర్వాత అతడ్ని షూట్ చేయించింది. అయితే విషయం బయటకు తెలియడంతో పోలీసులు భార్యతో పాటు ప్రియుడ్ని కూడా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి3న మృతుడి భార్య శివాని అలియాస్ సీమ.. తన భర్త తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సీమ భర్త కపిల్ చౌదరిని ఆస్రత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అతడు మరణించాడు. ఆర్థిక ఇబ్బందులతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులుకు భార్య సీమ తెలిపింది. అయితే పోలీసులు మృతుడి దేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో కపిల్ మరణ రహస్యం బయటపడింది.

First published:

Tags: Crime, Extramarital affairs, Uttar pradesh

ఉత్తమ కథలు