• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • GENERAL ELECTION 2019 BENGAL BJP UNIT WANTS PM NARENDRA MODI TO CONTEST FROM THE STATE THIS TIME NK

బెంగాల్ నుంచీ నరేంద్ర మోదీ పోటీ... మమతా బెనర్జీకి షాక్ ఇవ్వబోతున్నారా...

బెంగాల్ నుంచీ నరేంద్ర మోదీ పోటీ... మమతా బెనర్జీకి షాక్ ఇవ్వబోతున్నారా...

నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ

Lok Sabha Election 2019 : 2014 ఎన్నికల్లో మోదీ మేనియా ఒక్కటే కనిపించింది. ఈసారి మాత్రం ఎన్నో సరికొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీదీ జోరును అడ్డుకునేందుకు నరేంద్ర మోదీ బెంగాల్ నుంచీ బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
2019లో బీజేపీ ప్రయోగాలు బాగా చేపడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు హిందీ బెల్టులో పడిపోయిన ర్యాంకును తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే... మరోవైపు హిందీయేతర రాష్ట్రాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వారణాసి లోక్ సభ స్థానం నుంచీ మరోసారి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ... బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు బెంగాల్‌లో ఓ లోక్ సభ స్థానం నుంచీ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు మోదీ సిద్ధంగా ఉండగా... పార్టీ నేతలు కూడా సై అంటున్నారని సమాచారం. ఇప్పటికే మోదీ ప్రత్యర్థి అయిన రాహుల్ గాంధీ... రెగ్యులర్ అమేథీతోపాటూ... కేరళలోని వాయనాడ్ నుంచి కూడా బరిలో దిగుతండటంతో... మోదీ ఈసారి రెండో స్థానం కోసం బెంగాల్ వైపు చూస్తున్నారని తెలిసింది.

2014లో దేశంలోని చాలా రాష్ట్రాలు బీజేపీ వశమయ్యాయి. కానీ బెంగాల్‌లో మాత్రం మోదీ గాలి వీయలేదు. అందుకు ప్రధాన కారణం అప్పటికే బలంగా పాతుకుపోయిన మమతా బెనర్జీయే. ఆమెను దాటుకొని ముందుకు వెళ్లడం బీజేపీకి అసలైన సమస్యగా మారింది. ఆమెను కంట్రోల్ చెయ్యాలంటే నరేంద్ర మోదీ లాంటి బలమైన నేత రంగంలోకి దిగాలని భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం... ఎవర్నో ఎందుకు మోదీనే దించుదామని డిసైడైనట్లు తెలిసింది. బెంగాల్ లోని ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచీ మోదీ బరిలో దిగుతారని సమాచారం.


బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 12, 19న చివరి రెండు దశల పోలింగ్ జరగబోతోంది. దక్షిణ దీనాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్‌లో నరేంద్ర మోదీని కలిసిన ముకుల్ రాయ్... చివరి దశలోపు ఏదో ఒక స్థానం నుంచీ పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా మమతా బెనర్జీకి చెక్ పెట్టినట్లు అవుతుందని లెక్కలు వేసుకున్నట్లు తెలిసింది.

2011లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 34 స్థానాలు దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ కనీసం 23 స్థానాలు గెలవాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా టార్గెట్ పెట్టారు. ఆ దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

ఆటో కాదు... కారు కాదు... ఇది క్వాడ్రా సైకిల్... ఇవీ ప్రత్యేకతలు...

మూడో దశ ఎన్నికలకు నేటితో ముగియనున్న ప్రచారం... 96 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్

అభ్యర్థులు 370 మంది... 58 మందిపై పెండింగ్ కేసులు... గుజరాత్‌లో నేరస్థులకే టికెట్లు ఇస్తున్నారా...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారా... నిజానిజాలేంటి...
First published:

అగ్ర కథనాలు