Army Vice Chief : ఆర్మీలో అరుదైన ఘటన..ఆర్మీ వైస్ చీఫ్ గా బీఎస్ రాజు నియామకం
ఆర్మీ వైస్ చీఫ్ గా నియమితులైన బీఎస్ రాజు
New Army Vice Chief : తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS)గా లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు నియమితులయ్యరు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే..చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా తాజాగా నియమితులయ్యారు.
New Army Vice Chief : తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS)గా లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు నియమితులయ్యరు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే..చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా తాజాగా నియమితులయ్యారు. దీంతో మనోజ్ పాండే స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు(BS Raju)వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే VCOASగా లెఫ్టినెంట్ జనరల్ రాజు నియామకం అనేది అరుదైన సంఘటన. ఎందుకంటే ఆర్మీ కమాండర్ కాని అధికారి వైస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం అరుదైన సంఘటనే. లెఫ్టినెంట్ జనరల్ రాజు గతంలో శ్రీనగర్‌లో 15 కార్ప్స్కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం మిలటరీ ఆపరేషన్స్ డీజీ(DGMO)గా లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మే 1న తదుపరి ఆర్మీ వైస్ చీఫ్ గా బగ్గవల్లి సోమశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.
క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ కూడా అయిన బీఎస్ రాజు.. లడఖ్ సెక్టార్ లో రెండేళ్లుగా చైనాతో కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనను నిశితంగా పర్యవేక్షిస్తున్నాడు. బీజాపూర్ సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన బీఎస్ రాజు.. మొదటిసారిగా డిసెంబర్ 15,1984న జాట్ రెజిమెంట్ లో నియమితులయ్యారు. 38 ఏళ్ల సర్వీసులో జనరల్ రాజు... వెస్ట్రన్ థియేటర్ లో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో తన బెటాలియన్ కు నాయకత్వం వహించారు. జమ్మూ కాశ్మీర్ లో, నియంత్రణ రేఖ వెంబడి ఉరీ బ్రిగేడ్, కౌంటర్ తిరుగుబాటు దళం మరియు శ్రీనగర్-ఆధారిత హెచ్క్యూస్ 15 కార్ప్స్కు నాయకత్వం వహించారు. భూటాన్ లో భారత సైనిక శిక్షణా బృందానికి కమాండెంట్ గా కూడా బీఎస్ రాజు పనిచేసినట్లు సైన్యం అతని నియామకంపై ఒక ప్రకటనలో తెలిపింది.
క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ కూడా అయిన బీఎస్ రాజు..ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్ లో భాగంగా సోమాలియాలో ఆపరేషన్ ఫ్లయింగ్ చేపట్టారు. భారతదేశంలో ముఖ్యమైన కెరీర్ కోర్సులను అభ్యసించన రాజు.. యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో చదివారు. అంతేకాకుండా, యునైటెడ్ స్టేట్స్‌లోని మోంటెరీలోని నావల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్కూల్ నుండి కౌంటర్ టెర్రరిజంలో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందాడు. మరోవైపు,బీఎస్ రాజు తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS)గా నియమితులైన నేపథ్యంలో..ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కతియార్ సైన్యం తదుపరి DGMOగా నియమితులయ్యారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.