నేడే గీతా స్వయంవరం..!

గీతను పెళ్లాడేందుకు దేశవ్యాప్తంగా 50 మంది యువకులు పోటీపడ్డారు. వారి ఫొటోలు, బయోడేటాను చూసిన తర్వాత 16 మందిని గీత ఎంపిక చేసింది. వారిలో నుంచి 14 మంది స్వయం వరంలో పాల్గొననున్నారు. వారిల నుంచి ఒక్కరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోబోతోంది

Shiva Kumar Addula | news18
Updated: June 7, 2018, 5:21 PM IST
నేడే గీతా స్వయంవరం..!
గీత (ఫైల్ ఫొటో)
  • News18
  • Last Updated: June 7, 2018, 5:21 PM IST
  • Share this:
గతంలో తప్పిపోయి పాకిస్తాన్ వెళ్లి... కేంద్రం చొరవతో తిరిగి మాతృభూమికి  క్షేమంగా చేరిన మూగ, బధిర యువతి గీతా గుర్తుంది కదా..! చిన్నప్పుడు పాకిస్తాన్ వెళ్లిన గీత .. 14 ఏళ్ల తర్వాత 2015లో భారత్‌కు చేరింది. ఆమెకు పెళ్లి ఈడు రావడంతో వరుడిని ఎంపిక చేసుకునే అవకాశమం గీతకే కల్పించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే గీత పెళ్లి కోసం స్వయంవరం నిర్వహిస్తున్నారు.

ఇవాళే గీత స్వయంవరం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇవాళ, రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది. గీతను పెళ్లాడేందుకు దేశవ్యాప్తంగా 50 మంది యువకులు పోటీపడ్డారు. వారి ఫొటోలు, బయోడేటాను చూసిన తర్వాత 16 మందిని గీత ఎంపిక చేసింది. వారిలో నుంచి 14 మంది స్వయం వరంలో పాల్గొననున్నారు. ఇండోర్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇవాళ  ఆరుగురు గీతాను కలుస్తారు. మిగిలిన 8 మందితో రేపు ముఖాముఖి అవుతుంది.

స్వయంవరంలో గీత ఒక్కొక్కరితో 10 నిమిషాలు మాట్లాడుతుంది. అనంతరం ఆ  14 మందిలో నుంచి ఒక్కరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోబోతోంది. గీతా స్వయంవరానికి వస్తున్న వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.  రైతులు, హోటల్‌లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది సైతం గీతను పెళ్లాడేందుకు  ఆసక్తి చూపుతున్నారు. ఆమెకు మంచి జీవితాన్ని ప్రసాదించి చివరి శ్వాస వరకు తోడుగా ఉంటామని చెబుతున్నారు.

గీత భారత్‌కు వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ తల్లిదండ్రుల వివరాలు తెలియలేదు.  ప్రస్తుతం ఇండర్‌లోని స్కీమ్ 71 ప్రాంతంలోని ఓ ఆర్గనైజేషన్‌లో ఉంటోంది. , ఇటీవల మహారాష్ట్రకు చెందిన దంపతులు గీత తమ కూతురని..తమకు అప్పగించాలని ముందుకొచ్చారు. నాసిక్‌లోని దిండోరి ఉంటున్న ఆ దంపతులు గీతలా ఉన్న ఓ ఫొటోను కూాడా చూపిస్తున్నారు.  కాగా, స్వయంవరంలో గీత ఎవ్వరనీ పెళ్లాడబోతోందనేది ఆసక్తిగా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: June 7, 2018, 5:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading