హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

CAG చీఫ్‌గా జీసీ ముర్ము నియామకం..

CAG చీఫ్‌గా జీసీ ముర్ము నియామకం..

జీసీ ముర్ము (File)

జీసీ ముర్ము (File)

నిన్నటి వరకు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ముర్మును కాగ్ చీఫ్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

    భారత కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ గా గిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. నిన్నటి వరకు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ముర్ము నిన్న రాత్రి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. ఆయన స్థానంలో కొత్తగా మనోజ్ సిన్హా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఇప్పుడు ముర్మును కాగ్ చీఫ్ గా నియమిస్తూ కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా పేరుతో నోటిఫికేషన్ జారీ అయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 క్లాజ్ 1 ప్రకారం సంక్రమించిన అధికారాలకు అనుగుణంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్‌ ఆఫ్ ఇండియాగా గిరిష్ చంద్ర ముర్మును నియమిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ అయింది. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

    జీసీ ముర్మును కాగ్ చీఫ్ గా అపాయింట్ చేస్తూ జారీ అయిన నోటిఫికేషన్

    ప్రస్తుత కాగ్ చీఫ్ రాజీవ్ మెహరిషీ పదవీకాలం ఈ వారాంతంలో ముగుస్తుంది. ఆగస్ట్ 8న ఆయన 65వ సంవత్సరంలో అడుగుపెడతారు. కాగ్ చీఫ్ పదవి రాజ్యాంగబద్ధమైనది. దీన్ని ఖాళీగా ఉంచకూడదు. ఈ క్రమంలో రాజీవ్ మెహరిషి తర్వాత ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు చేసిన కేంద్రం జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న జీసీ ముర్మును ఎంపిక చేసింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jammu and Kashmir

    ఉత్తమ కథలు