జమ్మూకశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్ చంద్ర ముర్ము.. సత్యపాల్ మాలిక్ బదిలీ

First L-G of Jammu and Kashmir : ప్రస్తుత జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవా గవర్నర్‌గా బదిలీ చేశారు. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డ లడఖ్‌కు కృష్ణ మాథూర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.

news18-telugu
Updated: October 25, 2019, 8:33 PM IST
జమ్మూకశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్ చంద్ర ముర్ము.. సత్యపాల్ మాలిక్ బదిలీ
సత్యపాల్ మాలిక్ (File Photo)
  • Share this:
జమ్మూకశ్మీర్‌‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఐఏఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్మును నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవా గవర్నర్‌గా బదిలీ చేశారు. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డ లడఖ్‌కు కృష్ణ మాథూర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. ఇక మిజోరం కొత్త గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిల్లైని నియమించారు. జమ్మూకశ్మీర్,లడఖ్‌లు రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డ నేపథ్యంలో రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా,జమ్మూకశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించబడ్డ గిరీష్ చంద్ర ముర్ము 1985 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌. గతంలో ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.
Published by: Srinivas Mittapalli
First published: October 25, 2019, 8:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading