• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • GAVE BIRTH TO 2 WHY NOT 20 UTTARAKHAND CHIEF MINISTER TIRATH SINGH ONCE AGAIN STOKED A CONTROVERSY SRD

ఇద్దరే ఎందుకు 20 మందిని కనాల్సింది..మరో వివాదానికి తెర తీసిన కొత్త సీఎం..

ఇద్దరే ఎందుకు 20 మందిని కనాల్సింది..మరో వివాదానికి తెర తీసిన కొత్త సీఎం..

తీరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్‌ కొత్త సీఎం తీరథ్ సింగ్ రావత్.. మొన్నే పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ అప్పుడే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మహిళలు చిరిగిన జీన్స్ వేసుకొని సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అంతలోనే మరోసారి విపక్షాలకు దొరికిపోయారు తీరథ్ సింగ్ రావత్.

  • Share this:
    ఉత్తరాఖండ్‌ కొత్త సీఎం తీరథ్ సింగ్ రావత్.. మొన్నే పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ అప్పుడే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మహిళలు చిరిగిన జీన్స్ వేసుకొని సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అంతలోనే మరోసారి విపక్షాలకు దొరికిపోయారు తీరథ్ సింగ్ రావత్. మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిన అమెరికా కరోనాను ఎదుర్కోలేక చేతులెత్తేసిందన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరో వివాదానికి తెరతీశారు. కోవిడ్ మహమ్మారి మధ్య తమను తాము పోషించుకోవడానికి కష్టపడుతున్న పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు పంపిణీ చేసే కేంద్ర ప్రభుత్వ పథకం నుండి ఎక్కువ లబ్ది పొందాలంటే 20 మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాదు ఇద్దరు పిల్లలున్న మీరెందుకు అసూయపడతారు.. ఇరవైమందిని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. అటవీ దినోత్సవం సందర్బంగా రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంతో ఉత్తరాఖండ్ సీఎం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ ‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా నాణ్యమైన రేషన్ సరుకులను పేదవారికి కేంద్రం అందిస్తోంది‌ మనిషికి ఐదు కేజీల చొప్పున సరుకులు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో, నలుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల సరుకులు దక్కుతుండగా, 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటా సరుకులు లభిస్తున్నాయన్నారు. దీంతో ఎక్కువ సరుకులు పొందుతోన్న వారిపై చిన్నకుటుంబాల వాళ్లు అసూయతో రగిలిపోతున్నారంటూ విచక్షణా రహిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మీకు అసూయ..ఇద్దరు పిల్లల్నే కని ఆపేయడం ఎందుకు, 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు.


    ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేగాకుండా…అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ నాలుక కరుచుకున్నారు. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు