Home /News /national /

GAUTAM GAMBHIR TARGETS KEJRIWAL FOR TAKING CREDIT FOR DELHIS IMPROVED COVID 19 SITUATION MK

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఎంపీ గౌతం గంభీర్ ఫైర్...

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

కేజ్రీవాల్ మొత్తం క్రెడిట్‌ తీసుకోవాలని తాపత్రయపడుతున్నట్లు విమర్శించారు. కోవిడ్ నివారణ అంశంపై ప్రతి గంటగంటకూ ఎందుకు ట్వీట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు.

    బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. కరోనా నియంత్రణలో కేంద్రం తీసుకున్న చొరవను తన ఖాతాలో వేసుకునేందుకు ఆప్‌ సర్కారు, సీఎం కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారంటూ గౌతం గంభీర్‌ ఆరోపించారు. అంతేకాదు గంభీర్ మరో అడుగు ముందుకేజి కేజ్రీవాల్‌ను తుగ్లక్‌ అంటూ విమర్శించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ చూపి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే కేజ్రీవాల్ మొత్తం క్రెడిట్‌ తీసుకోవాలని తాపత్రయపడుతున్నట్లు విమర్శించారు. కోవిడ్ నివారణ అంశంపై ప్రతి గంటగంటకూ ఎందుకు ట్వీట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, కరోనాకు వ్యతిరేకంగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజల మద్దతుతో ముందంజలో ఉన్నారని, రాజధానిలో కరోనా నుంచి 84,694 మంది కోలుకున్నారని ఆప్‌ తన అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేసింది. దీనిపై ఎంపీ గౌతం గంభీర్‌ స్పందించారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Gautam Gambhir

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు