కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేసిన గంభీర్... తీవ్రమవుతున్న పాంప్లెట్ల దుమారం

Lok Sabha Election 2019 : బీజేపీ అభ్యర్థి గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంప్రదాయ రాజకీయ నేతల్లా లైట్ తీసుకోని గంభీర్... కోర్టుల్లోనే తేల్చుకుంటానంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 10, 2019, 12:04 PM IST
కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేసిన గంభీర్... తీవ్రమవుతున్న పాంప్లెట్ల దుమారం
కేజ్రీవాల్, గౌతం గంభీర్ (File)
  • Share this:
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అతిషీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ శిసోడియాకు పరువు నష్టం దావా నోటీస్ పంపారు గౌతం గంభీర్. తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంభీర్ ఈ విషయంలో తాడో పేడో తేల్చుకుంటానంటున్నాడు. గంభీర్... తన ప్రత్యర్థి, ఢిల్లీ తూర్పు నుంచీ ఆప్ తరపున బరిలో ఉన్న అభ్యర్థి అతిషీకి వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో కూడిన, కులపరమైన అంశాలతో ఉన్న పాంప్లెట్లు పంచారని... ఆప్ నేతల నుంచీ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన అతిషీ... కన్నీరు పెట్టారు. ఇలాంటి పాంప్లెట్లు పంచుతూ గంభీర్ ఏ స్థాయికి దిగజారిపోయాడో చూడండి అంటూ మండిపడ్డారు.

అతిషీ మిక్స్‌‌డ్ బ్రీడ్ (చాలా మందికి పుట్టిన) కి ఉదాహరణ అనీ, బీఫ్ ఈటర్ (గొడ్డు మాంశం తినే వారు)ని పెళ్లి చేసుకున్నారనీ, ఆమెను వేశ్యగా అభివర్ణిస్తూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు ఆ పాంప్లెట్లలో ఉన్నాయి. అతిషీ త్వరలో శిశోడియా కొడుక్కి పిల్లాణ్ని కనిపెడతారనే తీవ్రమైన కామెంట్లు కూడా అందులో ఉన్నాయి.

తనపై వచ్చిన ఆరోపణలను గంభీర్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణలు తాను చేసినట్లు నిరూపిస్తే, అభ్యర్థిత్వం నుంచీ తప్పుకుంటానని ఆయన అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యడం తగదన్న ఆయన... ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో తాను ఎవరికీ వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లూ చెయ్యలేదని అన్నారు.

 

ఇవి కూడా చదవండి :

వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం


ఉండవల్లికి గాలం వేస్తున్న టీడీపీ... వైసీపీ వదులుతుందా... ?దొనకొండపై వైసీపీ నేతల దృష్టి... జోరుగా భూముల కొనుగోళ్లు...

23న ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం... లెక్క త్వరగా తేలదంటున్న అధికారులు...
First published: May 10, 2019, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading