కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గతిశక్తి (Gatishakti) నేషనల్ మాస్టర్ ప్లాన్ (National Master Plan)ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్త ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌ను సమీక్షించారు. అనంతరం గతిశక్తి మాస్టర్ ప్లాన్‌ను లాంచ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 100 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులు దేశ దశ దిశను మార్చేస్తాయని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీ దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో సమూల మార్పులు తీసురానుందని చెబుతోంది. ఇది మన దేశాభిద్ధికి కొత్త దిక్సూచిగా నిలవబోతోందని కేంద్రమంత్రి పీయుష్ గోయెల్ (Piyush goyal)అన్నారు. ఇది సాధ్యంకాదని గతంలో అనుకున్నామని.. కానీ ఎట్టకేలకు పట్టాలెక్కుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ (Multi Model connectivity) ద్వారా ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా కూడా మెరుగుపడుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గడంతో పాటు సప్లై చైన్ మరింత వృద్ధి చెందుతుంది. స్థానిక ఉత్పత్తులకు దేశ విదేశాల్లోనూ పోటీ ఉండేలా దోహదపడుతుంది.
Special Trains: దసరాకు ఊరెళ్తున్నారా? మీకే ఈ గుడ్‌న్యూస్.. మరో 3 ప్రత్యేక రైళ్లు
'' మన గతంలో వర్క్ ఇన్ ప్రొగ్రెస్ (Work in progress) బోర్డులను చూసేవాళ్లం. వాటిని చూవి ఇవి ఎప్పటికీ పూర్తికావు అనే భావన ప్రజల్లో ఉండేది. ప్రభుత్వ పనులు అంటేనే ఆలస్యం, ప్రజా ధనం వృథా అనే అభిప్రాయం ఉంది. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితి ఉండదు. గతి శక్తి మౌలిక వసతుల రంగంలో సమూల మార్పులు తీసుకురానుంది. వచ్చే 25 ఏళ్ల భవిష్యత్ కోసం పునాది వేస్తున్నాం. 21వ శతాబ్ధపు అభివృద్ధి ప్రణాళికను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు నేషనల్ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుంది. అనుకున్న సమయానికే ప్రాజెక్టు పూర్తయ్యేలా ఉపయోగపడుతుంది.'' అని ప్రధాని మోదీ అన్నారు.
Delhi: PM Narendra Modi inaugurates PM GatiShakti-National Master Plan for multi-modal connectivity & new exhibition complexes of ITPO pic.twitter.com/bHDJ5xG9kx
— ANI (@ANI) October 13, 2021
Manipur Terror Attack: మణిపూర్‌లో ఉగ్రవాదుల బీభత్సం.. జనాలపై కాల్పులు.. ఐదుగురు మృతి
‘పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్’ అనేది జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్. మౌలిక రంగంలో సమూలంగా మార్పులు చేసి, శాఖల మధ్య సమన్వయంతో గతిశక్తిని చేపట్టనున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్రం బలంగా నమ్ముతోంది. భారత వ్యాపార రంగంలో పోటీ తత్వం పెంచడంతో పాటు టెక్స్‌టైల్, ఫార్మాసూటికల్ క్లస్టర్స్, డిఫెన్స్ కారిడార్, ఎలక్ట్రానిక్ పార్క్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఫిషింగ్ క్లస్టర్స్, అగ్రి జోన్స్‌ను అనుసంధానం చేస్తారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెంచడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు గతి శక్తి ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు వలన ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా సాఫీగా సాగిపోతుంది. ఎక్కడా ఇబ్బందులు ఉండవు. చివరి మైలు వరకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తద్వారా ప్రయాణ సమయం తగ్గుతుంది.
Whatsapp: రాత్రిపూట వాట్సాప్ సేవలు బంద్.. కావాలంటే డబ్బులు కట్టాలా? కేంద్రం క్లారిటీ
ఇన్‌ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు.. 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి. అంటే ఏ శాఖ ఏ ప్రాజెక్టు చేపడుతుందో ఆ వివరాలన్నీ అన్ని శాఖలకూ అందుబాటులో ఉంటాయి. వీటిలో హై రిజల్యూషన్‌తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి? అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే వివరాలను పొందుపరుస్తారు. తద్వారా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకునేందుకు పెట్టుబడిదారులకు సులభమవుతుంది. ఈ పనులను 2024-25 సరికి పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతి శక్తి ద్వారా కీలకమైన ప్రాజెక్టులను పూర్తిచేసిన తర్వాతే 2024 ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.