హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Breaking News: కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య 84 రోజుల గ్యాప్.. మళ్లీ మారుతుందా ?

Breaking News: కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య 84 రోజుల గ్యాప్.. మళ్లీ మారుతుందా ?

నీతి ఆయోగ్‌ సిఫార్సుతో కోవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య గ్యాప్‌ను 6-8 వారాల నుంచి 12-16 వారాలకు గత ఏడాది మే 13న కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అయితే ప్రస్తుతం కరోనా ఫోర్త్‌ వేవ్‌పై ఆందోళన నేపథ్యంలో నీతి ఆయోగ్‌ సిఫార్సుతో రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 8-16 వారాలకు మార్పు చేసింది.

నీతి ఆయోగ్‌ సిఫార్సుతో కోవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య గ్యాప్‌ను 6-8 వారాల నుంచి 12-16 వారాలకు గత ఏడాది మే 13న కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అయితే ప్రస్తుతం కరోనా ఫోర్త్‌ వేవ్‌పై ఆందోళన నేపథ్యంలో నీతి ఆయోగ్‌ సిఫార్సుతో రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 8-16 వారాలకు మార్పు చేసింది.

Covishield: కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని రెండుసార్లు సవరించారు. అయితే ఇప్పుడు మూడోసారి ఈ గడువును మార్చే యోచనలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉందనే వార్తలు మొదలయ్యాయి.

మన దేశంలో ఎక్కువమందికి ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్(Covishield)  . సీరమ్ ఇన్స్‌టిట్యూట్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య కనీసం 84 రోజుల గ్యాప్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ డోసులకు ఈ మాత్రం గ్యాప్ ఇస్తేనే.. అవి సమర్థవంతంగా పని చేస్తాయని అప్పట్లో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే వ్యాక్సిన్(Vaccine) కొరతను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య ఉన్న 84 రోజుల వ్యవధి విషయంలో పునరాలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని రెండుసార్లు సవరించారు. అయితే ఇప్పుడు మూడోసారి ఈ గడువును మార్చే యోచనలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉందనే వార్తలు మొదలయ్యాయి.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు సవరించారు. దీనిపై నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేన్‌లో చర్చిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరిలో వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో రెండో డోసుల మధ్య వ్యవధిని ప్రభుత్వం నాలుగు నుంచి ఆరు వారాలుగా నిర్ణయించింది. ఆ తరువాత దీన్ని ఆరు నుంచి ఎనిమిది వారాలకు పెంచింది. మే నెలలో ఈ వ్యవధిని మరోసారి పొడిగించింది కేంద్రం.

కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచింది. ఇంగ్లండ్‌లో వెలుగు చూసిన వాస్తవ పరిస్థితుల ఆధారంగానే రెండో డోసుల మధ్య గ్యాప్ విషయంలో ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అయితే వ్యాక్సిన్ కొరత కారణంగానే ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానల్ మాత్రం ఎక్కువ గ్యాప్ కారణంగా ఎక్కువ యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయని వెల్లడించింది.

Covaxin-Covishied: కొవాగ్జిన్, కోవిషీల్డ్ డోసుల మిక్సింగ్‌పై డీసీజీఐ కీలక నిర్ణయం.. ప్రయోగాలకు ఓకే

అయితే ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత పెద్దగా లేకపోవడం, ఉత్పత్తి కూడా పెరగడంతో రెండు డోసుల మధ్య గ్యాప్ తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందా ? అనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఈ గ్యాప్‌ను ఎంత మేరకు తగ్గిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఉన్నట్టుగా రెండు డోసుల మధ్య గ్యాప్‌ను నాలుగు నుంచి ఆరు వారాలకు తగ్గిస్తారా ? లేక అంతకంటే ఎక్కువ వ్యవధిని నిర్ణయిస్తారా అన్నది చూడాలి.

First published:

Tags: COVID-19 vaccine, Covishield

ఉత్తమ కథలు