Home /News /national /

GANJA SMUGGLING IN CEMENT MIXING TANKER IN BIHAR IT LOOK LIKES PUSHPA MOVIE MILK TANKER SMUGGLING SCENE SK

Ganja Smuggling: పుష్ప మూవీ చూసి నేర్చుకున్నారేమో.. అచ్చం అలాగే స్మగ్లింగ్.. ట్యాంకర్ లోపల 5వేల కిలోల గంజాయి

కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంకర్‌లో గంజాయి

కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంకర్‌లో గంజాయి

Ganja Smuggling: ట్యాంకర్ బేస్‌మెంట్‌లో మొత్తం 111 ప్యాకెట్లలో 5 క్వింటాళ్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ గంజాయిని ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని అరా ప్రాంతానికి తరలిస్తుండగా మదన్‌పూర్ సమీపంలో పట్టుకున్నారు.

    పుష్ప సినిమా (Pushpa Movie) చూశారుగా..! అందులో ఫారెస్ట్ అధికారుల కళ్లు గప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు హీరో పుష్ప. పాల ట్యాంకర్‌‌ను రెండు ఛాంబర్‌లుగా విభజించి.. పైభాగంలో పాలు.. కింది భాగంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తుంటారు. దానిని చూస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. పైకి పాలను తరలించే ట్యాంకర్‌లానే ఉంటుంది గానీ..లోపల మాత్రం ఎర్రచందనం దుంగలు ఉంటాయి. మరి ఈ సినిమాను చూసి కొంత మంది కేటుగాళ్లు స్ఫూర్తి పొందినట్లున్నారు. అచ్చం అలాగే స్మగ్లింగ్ చేస్తున్నారు. పుష్ఫ సినిమాను తలపించేలా గంజాయి స్మగ్లింగ్ (Ganja Smuggling) చేస్తున్న ముఠాను బీహార్ పోలీసులు (Bihar Police) పట్టుకున్నారు. సిమెంట్ కాంక్రీట్ ట్యాంకర్‌లో గంజాయిని తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

    Wife: భర్తతో ఇంత ప్రేమగా ఉన్నావు కదా.. ఇలా ఎందుకు చేయాలనిపించింది.. కలికాలం..

    పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ సిమెంట్ కాంక్రీట్ ట్యాంకర్‌లో గంజాయిని తరలిస్తున్నారని మదన్‌పూర్ పోలీస్‌లకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దానిపై ఫోకస్ పెట్టారు. ఆ సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాత.. ఔరంగాబాద్ ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మురం చేశారు. ఈ క్రమంలోనే చెక్‌పోస్ట్ వైపు ఓ కాంక్రీట్ మిక్స్ ట్యాంకర్ వచ్చింది. దాని క్యాబిన్‌లో చెక్ చేస్తే ఏమీ దొరకలేదు. ట్యాంకర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తే పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. WB73 D 3031 నెంబర్ ఉన్న ఆ ట్యాంకర్ బేస్‌మెంట్‌లో మొత్తం 111 ప్యాకెట్లలో 5 క్వింటాళ్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ గంజాయిని ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని అరా ప్రాంతానికి తరలిస్తుండగా మదన్‌పూర్ సమీపంలో పట్టుకున్నారు. దాని విలువ రూ.70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో బాలిక.. ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలు.. మరో నిర్భయ ఘటన

    పోలీసులను చూసి ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఐతే క్యాబిన్‌లో ఓ మొబైల్ ఫోన్ దొరికింది. ట్యాంకర్ రిజిస్ట్రేషన్ నెంబర్, సీజ్ చేసిన ఫోన్‌లో ఉన్న వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలో ఎవరి వద్ద నుంచి గంజాయిని సేకరిస్తున్నారు? పశ్చిమ బెంగాల్‌లో ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. అసలు ఈ గంజాయి ముఠా వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులకు రివార్డు అందజేస్తామని ఔరంగాబాద్ ఎస్పీ తెలిపారు.

    Shocking Incident: వామ్మో.. నువ్వేం కొడుకువిరా నాయనా.. ఆ టైంలో యాపిల్ తిన్నావా..

    బీహార్‌లో 2016 నుంచి మద్య నిషేధ చట్టం అమల్లో ఉంది. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాత గంజాయి, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా కూడా పెరిగింది. వీటికి వ్యతిరేక పోలీసులు నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నా.. పెద్ద మొత్తంలో గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం స్థానికంగా చర్చనీయాంశమయింది. గంజాయి ముఠాపై పోలీసులు సాధించిన పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bihar, Smuggling

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు