Home /News /national /

GANGA SOJOURN DALIT OUTREACH HOW PRIYANKA GANDHIS TRUMP CARDS HAVE HIT SP BSP BJP POLL GAME NK

గంగానది వెంట ప్రియాంక గాంధీ ప్రచార ప్రయాణం... ఎస్పీ-బీఎస్పీ, బీజేపీ ఎందుకు ఆందోళన చెందుతున్నాయి?

ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ

Lok Sabha Elections 2019 : 2014లో మోదీ మేనియా ముందు ప్రియాంక ప్రయత్నాలేవీ ఫలించలేదు. మరి ఇప్పుడేంటి? సీన్ మారుతుందా?

సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి కాంగ్రెస్ వీలైన అన్ని కోణాల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాస్ట్ బేస్డ్ కాలిక్యులేషన్స్ వేసుకుంటోంది. దళితులు, ఓబీసీ వర్గాల్ని చేరువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. గుజరాత్‌లో పాటీదార్ లీడర్ హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరడం ఇందులో భాగమే. ఉత్తర ప్రదేశ్‌లో దళిత యూత్ లీడర్ చంద్రశేఖర్ ఆజాద్‌ని ఆహ్వానించడం కూడా భారీ ఎత్తుగడే. గంగా ప్రవాహంలో సాగుతున్న ప్రియాంక గాంధీ ఎన్నికల వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలను ఆలోచనలో పడేస్తున్నాయి. గంగా నదీ సమీపాన పర్యటిస్తున్న ప్రియాంక... యాదవేతర వర్గాల్ని భారీ ఎత్తున ఆకర్షిస్తున్నారు. వాళ్లలో చాలా మంది అత్యంత వెనకబడినవారే.

ప్రియాంక ఎత్తుగడలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కన్నెర్ర జేస్తున్నారు. బీజేపీ కూడా అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఆమె కదలికలపై అసంతృప్తిగా ఉంది. యూపీలో కాంగ్రెస్ ప్రచారం తమను చాలా ఇబ్బంది పెడుతోందని ఓ పేరు చెప్పడానికి ఇష్టపడని ఎస్పీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఐతే... అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌కి బలంగా ఉన్న బీజేపీనీ, దళిత ఓటు బ్యాంకును కొల్లగొట్టే ఎస్పీ, బీఎస్పీలను ఎదుర్కోవడం అతి పెద్ద సవాలే.

ప్రియాంక గాంధీ... అలహాబాద్ నుంచీ వారణాసి వరకూ గంగా నది మీదుగా పర్యటించేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ సిద్ధం చేశారు. యూపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచీ కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నాయి. ఇలా గంగా నది మీదుగా వెళ్లడం ద్వారా ప్రియాంక... యాదవేతరులైన కుష్వాహా, షాక్య, కచహార్, కేవాత్, మల్లా, నిషాద్, కష్యప్, మౌర్య, రాజ్‌భార్ కులాల ప్రజలను కలిసే అవకాశం ఉంటుంది. గంగానది సమీపాన ఎక్కువగా ఉండేది వారే. రాష్ట్రంలోనీ బీసీల్లో 15 శాతం వీళ్లే.


యాదవేతరుల్లో ఎక్కువ మంది చేపలు పడుతూ, బోట్లు నడుపుతూ, నదీ సమీపాన వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. కొంతమంది నదిలోని మట్టితో బొమ్మలు తయారుచేస్తూ బతుకుతున్నారు. ప్రియాంక తన ప్రచారంలో యాదవేతరుల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు. వారికి చేరువవుతారు. అంతేకాదు... ప్రధాని చెబుతున్న స్వచ్ఛ గంగ నినాదం ఎంతవరకూ నిజమో కూడా ఆమె తెలుసుకోగలుగుతారు. ప్రధాని చెబుతున్నట్లు గంగా నది అనేది హైందవ మతానికి మాత్రమే సంబంధించినది కాదనీ... నదీ మార్గంలో హిందువులు, ముస్లింలు, ఎన్నో రకాల కులాల ప్రజలు కలిసి జీవిస్తున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు.

యూపీలో బీసీలు 55 శాతానికి పైగా ఉన్నారు. వీళ్లంతా ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో రకమైన తీర్పు ఇచ్చారు. వీళ్లలో ఎక్కువగా యాదవులు, అహిర్లు, గ్వాలాలు కలిసి దాదాపు 20 శాతం ఉన్నారు. మండల్ కమిషన్ కాలం నుంచీ వాళ్లు సమాజ్‌వాదీ పార్టీతోనే ఉన్నారు. ఇక కుర్మీలు, పటేళ్లు 7.5 శాతంగా ఉన్నారు. కుర్మీలు 2014 ఎన్నికలు... 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీవైపు మొగ్గు చూపారు. యూదవులు, కుర్మీలను.... అత్యంత వెనకబడిన వర్గాలుగా చెబుతారు. వీరు నిరంతరం తమ అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటారు. ఓవరాల్‌గా యాదవేతరులు ఎవరు తమను పట్టించుకుంటే ఆ పార్టీవైపు ఆకర్షితులవుతుంటారు. ప్రియాంక ద్వారా వాళ్లను ఆకట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ లబ్ది పొందాలనుకుంటోంది. ఇది ఎస్పీ-బీఎస్పీ, బీజేపీకి సమస్యే.


వీలైనంత ఎక్కువ మంది యాదవేతరులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ త్వరలో హార్దిక్ పటేల్‌తో కూడా యూపీలో ఎన్నికల ప్రచారం చేయించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రియాంక ముందున్న ప్లాన్... దళిత యూత్ నేత చంద్రశేఖర్ ఆజాద్‌ను మచ్చిక చేసుకోవడం. తర్వాత... పేద వర్గాలను చేరుకోవడం. కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడే ఎస్పీ-బీఎస్పీ, బీజేపీకి ఏమాత్రం మింగుడుపడట్లేదు.
First published:

Tags: Bjp, Congress, Lok Sabha Election 2019, Priyanka Gandhi, Sp-bsp, Uttar pradesh

తదుపరి వార్తలు