హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గంగానదిలో మినరల్ వాటర్.. లాక్‌డౌన్‌తో ఎవరూ ఊహించని మార్పు

గంగానదిలో మినరల్ వాటర్.. లాక్‌డౌన్‌తో ఎవరూ ఊహించని మార్పు

గంగా నది

గంగా నది

గంగా నది నీళ్లు మినరల్ వాటర్‌గా మారాయని.. ఆ జలాలను ఇప్పుడు ఎవరైనా నేరుగా తాగవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత గంగా నదిలో నీటి నాణ్యత 45శాతం వరకు పెరిగిందని తెలిపారు.

  లాక్‌డౌన్‌తో.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఫ్యాక్టరీల్లోని యంత్రాలు ఆగిపోయాయి. రణగొణ ధ్వనులు లేవు.. కాలుష్యం అంతకన్నా లేదు. పట్టణాల్లోనూ పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. 21 లాక్‌డౌన్‌తో ప్రకృతిలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న గంగా నది పూర్తిగా ప్రక్షాళన అయింది. లాక్‌డౌన్ కారణంగా.. వారణాసి, హరిద్వార్‌కు భక్తుల తాకిడి లేదు. నదిలో ఎవరూ పుణ్యస్నానాలు చేయడం లేదు. నదిలో ఎవరూ చెత్త వేయడం లేదు. అంతేకాదు చుట్టు పక్కల ఫ్యాక్టరీలు, హోటళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా లేవు.

  గత 20 రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో గంగా నది జలాలు తేటగా మారాయని IIT-BHU ప్రొఫెసర్ ANI వార్తా సంస్థతో చెప్పారు. కాలుష్య కాసారంలా ఉన్న గంగానది ఇప్పుడు మంచి నీటితో కళకళలాడుతోందని అన్నారు. నదిలో లోపల ఉండే చేపలు, ఇతర జీవచరాలు సైతం కంటికి కనిపిస్తున్నాయని చెప్పారు. గంగా నది నీళ్లు మినరల్ వాటర్‌గా మారాయని.. ఆ జలాలను ఇప్పుడు ఎవరైనా నేరుగా తాగవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత గంగా నదిలో నీటి నాణ్యత 45శాతం వరకు పెరిగిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో గంగా నది ప్రవాహం కూడా పెరిగిందని వెల్లడించారు.

  గంగా మాత్రమే కాదు.. యమునా నదిలోనూ నీటి నాణ్యత పెరిగినట్లు అధికారులు చెప్పారు. యమునా నదికి సంబంధించి సోషల్ మీడియాలో పలు ఫొటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్ తర్వాత యుమునా నదిని పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కరోనా ప్రభావంతో వచ్చిన లాక్‌డౌన్ ప్రజలతో పాటు ప్రకృతిలోనూ ఎంతో మార్పు తీసుకువచ్చిందని అంటున్నారు. గంగానది ప్రక్షాళన కోసం ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం లేదని.. కానీ లాక్‌డౌన్‌తో క్లీన్ గంగగా మారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. గతంలో గంగా నదిలో మునిగేందుకే ఇబ్బంది పడేవారని.. కానీ ఇప్పుడు ఏకంగా ఆ నీటిని తాగేలా గంగానది శుద్ధి జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Lockdown, Varanasi

  ఉత్తమ కథలు