అక్కడ మసీదుల్లో కూడా గణపతి మండపాలు..!

మహారాష్ట్రలోని కొల్హాపూర్ , సాంగ్లీ జిల్లా సరిహద్దులోని పలు పట్టణాల మసీదుల్లో కూడా గణపతి మండపాల్ని ఏర్పాటు చేస్తారు. వైభవంగా వినాయక చవితి వేడుకల్ని హిందూ ముస్లీం కలిసికట్టుగా నిర్వహిస్తారు. ఇలా ఒకటి రెండు సార్లు కాదు... అనేక ఏళ్ళుగా ఇక్కడ ఇలా మసీదుల్లో కూడా గణపతి విగ్రహాల్ని ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: August 31, 2019, 8:07 AM IST
అక్కడ మసీదుల్లో కూడా గణపతి మండపాలు..!
మసీదులో మోహర్రం పంజా, గణేష్ విగ్రహాలకు పూజలు
  • Share this:
భారతదేశం అంటేనే భిన్న మతాలు, భిన్న జాతులు.. భిన్న కులాల కలయిక. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో చూసిన అన్నివర్గాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి జీవిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంటారు. ఇక పండగలు, పబ్బాలు వచ్చినా కూడా అంతా కలిసి సంతోషంగా చేసుకుంటారు. వినాయకచవితి వేడుకల్లో కూడా హిందూ, ముస్లీంలు కలిసి పాల్గొంటారు. కానీ మహారాష్ట్రలోని కొన్ని పట్టణాలు,గ్రామాల ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. మతసామరాస్యానికి భారతీయులే.. నిలువెత్తు నిదర్శనమని చాటి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ముస్లీంలు, హిందువులు కలిసి మసీదుల్లో గణేష్ మండపాల్ని ఏర్పాటు చేస్తారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ , సాంగ్లీ జిల్లా సరిహద్దులోని పలు పట్టణాల మసీదుల్లో కూడా గణపతి మండపాల్ని ఏర్పాటు చేస్తారు. వైభవంగా వినాయక చవితి వేడుకల్ని హిందూ ముస్లీం కలిసికట్టుగా నిర్వహిస్తారు. ఇలా ఒకటి రెండు సార్లు కాదు... అనేక ఏళ్ళుగా ఇక్కడ ఇలా మసీదుల్లో కూడా గణపతి విగ్రహాల్ని ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. ముస్లీం సోదరులు, హిందువులు కలిసికట్టుగా  పండగల్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. బైరగదార్, కార్‌ఖానా పరి. షొల్కె, దెపన్‌పూర్, కుడెఖానాపీర్ మసీదుల్లో కొలువుదీరిన గణపతిని భక్తులు ఆరాధిస్తారు.

పోలీసులు సైతం ఇక్కడ జరిగే వేడుకల్ని ఎంతో ఆస్వాదిస్తారు. ప్రశాంతంగా తమ విధుల్ని నిర్వహిస్తారు. ఏదీ ఏమైనా భారతదేశానికికే గర్వకారణంగా, మతసామారస్యానికి ప్రతీకగా నిలిచి ఈ పట్టణాలు... మరెన్నో గ్రామాలకు, నగరాలకు ఆదర్శం కావాలని ఆశిద్దాం. ప్రతీచోట హిందు,ముస్లీంల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలని కోరుకుందాం.

First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు