2022 నాటికి సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసముందని మోదీ అన్నారు.

news18-telugu
Updated: October 2, 2019, 9:07 PM IST
2022 నాటికి సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ
  • Share this:
2022 నాటికి దేశంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసముందని మోదీ అన్నారు. గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీజీ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. అనంతరం స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసగించారు.

దేశంలోని గ్రామాలు స్వచ్ఛందంగా బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. ఇప్పుడు యావత్ ప్రపంచం మనల్ని అభినందిస్తోంది. 60 నెలల కాలంలోనే 60 కోట్ల మందికి టాయిలెట్లు సదుపాయం కల్పించడం, 11 కోట్ల టాయిలెట్లను నిర్మించాన్ని చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోతున్నాయి. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, జంతు పరిరక్షణకు మహాత్మా గాంధీకి ఎంతో కృషిచేశారు. ప్రస్తుతం మానవాళికి ప్లాస్టిక్ ముప్పుగా మారింది. 2022 నాటికి సింగిల్ యూస్ (ఒకసారి మాత్రమే వాడగలిగే) ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలి.
ప్రధాని మోదీ
అంతకముందు మోదీ గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ వాడిన వస్తువులు, ఆయన నడియాడిన నేలను సందర్శించి.. దేశానికి మహాత్ముడు చేసిన సేవను గుర్తు చేసుకున్నారు మోదీ.
Published by: Shiva Kumar Addula
First published: October 2, 2019, 9:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading