గాంధీ ఆత్మకథ మలయాళ అనువాదానికి రికార్డుస్థాయిలో డిమాండ్

2010, ఆగస్టు 20 నాటికి 7.78 లక్షల మలయాళ అనువాదం కాపీలు విక్రయించారు. 7.09 లక్షల కాపీలతో తమిళ రెండో స్థానంలో ఉంది.

news18-telugu
Updated: October 1, 2018, 6:42 PM IST
గాంధీ ఆత్మకథ మలయాళ అనువాదానికి రికార్డుస్థాయిలో డిమాండ్
మహాత్మా గాంధీ
  • Share this:
మంగళవారం (అక్టోబరు 2)న గాంధీ జయంతి వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఇది 150వ జయంతి కావడంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ ఆత్మకథ 'మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రుత్‌' పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా భారీగా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో మలయాళ అనువాద పుస్తకాలకు రికార్డు స్థాయిలో డిమాండ్ ఉన్నట్లు నవజీవన్ ట్రస్ట్ వెల్లడించింది. ఇప్పటి వరకు 7.78 లక్షల కాపీలు అమ్ముడుపోయాయని.. మరో లక్ష కాపీలకు ఆర్డర్లు వచ్చాయని చెప్పింది. గాంధీ మాతృభాష గుజరాతీతో పోలిస్తే మలయాళం కాపీలకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు న్యూస్‌ 18కు తెలిపారు.

గాంధీజీ ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ రాశారు. కానీ ఆయన జీవితాన్ని, సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలంటే ఆత్మకథనే చదవాలి. ప్రపంచంలోని లక్షలాంది మంది ఆయన ఆత్మకథ స్ఫూర్తిగా నిలుస్తోంది. కేరళలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు. గాంధీజీ జీవితాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంతోనే మలయాళం కాపీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. 'మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రుత్‌' పుస్తకం గుజరాతీ, హిందీ, మరాఠీ, తెలుగు సహా మొత్తం 15 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో కాశ్మీరి భాషలోనూ రానుంది. ఇక 29 విదేశీ భాషల్లోనూ లభ్యమవుతోంది.
వివేక్ దేశాయ్, నవజీవన్ ట్రస్ట్


గాంధీజీ తన ఆత్మ కథ " మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్"ను 1925 లో గుజరాతి భాషలో రాసారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్ దేశాయ్ ఇంగ్లీష్‌లోకి అనువదించారు. 1927 నుంచీ గుజరాతీ భాషలో పుస్తకాలను ప్రచురిస్తున్నారు. మలయాళ అనువాదం ప్రచురణ మాత్రం 1997లో ప్రారంభమైంది. ఐనప్పటికీ గుజరాతీతో పోలిస్తే మలయాళీ వర్షన్ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి. 2010, ఆగస్టు 20 నాటికి 7.78 లక్షల మలయాళ అనువాదం కాపీలు విక్రయించారు. 7.09 లక్షల కాపీలతో తమిళ రెండో స్థానంలో ఉంది. కేరళకు చెందిన పూర్ణోదయ బుక్ ట్రస్ట్ గాంధీ ఆత్మకథ మలయాళం అనువాద పుస్తకాలను విక్రయిస్తోంది. గాంధీ సిద్ధాంతాలను, కవిత్వంపై కేరళలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.

కాగా, గాంధీ ఆత్మకథ ప్రచురణ హక్కులు నవజీవన్ ట్రస్ట్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. భారత్‌లో మాత్రమే కాదు..ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ ఆత్మకథకు ఎంతో ఆదరణ లభిస్తోంది. పాకిస్తాన్‌లో కూడా బెస్ట్ సెల్లెర్స్ జాబితాలో ఆ పుస్తకం ఉందంటే..దాని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Published by: Shiva Kumar Addula
First published: October 1, 2018, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading