కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం అవినీతి అంశంపై ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. వారి నాయకులు చాలా మంది ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారని అన్నారు. లాలూ యాదవ్(Lalu prasad Yadav) కుటుంబం మొత్తం మీద చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇద్దరు మంత్రులు జైల్లో ఉన్నారని, రాహుల్ గాంధీ(Rahul Gandhi), సోనియా గాంధీ హెరాల్డ్ కేసులో నిందితులుగా ఉన్నారని ఆయన అన్నారు. వీరంతా సొంత బీబీసీ (బ్రష్టాచార్ బచావ్ క్యాంపెయిన్ ) నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అవమానించడంలో కాంగ్రెస్ ఎక్కడా వెనుకబడి లేదని నెట్‌వర్క్ 18 కార్యక్రమం రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023లో అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. విదేశాల్లో భారతదేశాన్ని అవమానిస్తున్నారని వ్యాఖయానించారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రకటనపై ఆయన ఇక్కడ మాట్లాడారు. రాహుల్ గాంధీ 7 కేసుల్లో బెయిల్‌పై ఉన్నారని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
గాంధీ కుటుంబం దేశానికి, చట్టానికి అతీతంగా భావిస్తోందని అన్నారు. అనర్హత వేటు పడిన తొలి నేత రాహుల్ గాంధీ కాదని.. అంతకుముందు చాలామంది దీన్ని ఎదుర్కొన్నారని అన్నారు. లాలూ ప్రసాద్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏడ్చారా లేక జయలలిత రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేశారా ? అని ప్రశ్నించారు. దేశ చట్టం కంటే ఒక వ్యక్తి గొప్ప కాదని అన్నారు. 2013 లిల్లీ థామస్ కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించినప్పుడు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చిందని.. అయితే దానిని రాహుల్ గాంధీ చించేశారని ఠాకూర్ గుర్తు చేశారు. గాంధీలు క్షమాపణలు చెప్పరని రాహుల్ గాంధీ అన్నారని.. 2018లో ఆయన క్షమాపణ చెప్పారని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ ఎప్పటికీ సావర్కర్ కాలేరని... దేశం కోసం సావర్కర్ ప్రాణత్యాగం చేశారని అనురాగ్ ఠాకూర్ అన్నారు. అనురాగ్ ఠాకూర్ బీబీసీని కూడా టార్గెట్ చేశారు. 2001 నుండి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రణాళికాబద్ధమైన ప్రచారం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టుకు చేరిందని అన్నారు. అకస్మాత్తుగా 2023లో బీబీసీ ఛానెల్ ఎందుకు మేల్కొందని ప్రశ్నించారు.
Pulses: పప్పుల ధరలపై కేంద్రం ఫోకస్.. రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం
బీబీసీ ఛానల్ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కంటే పెద్దదా? అని ప్రశ్నించారు. మోదీపై వారు అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని అన్నారు. ప్రధాని మోదీ ప్రజల హృదయాలలో ఉన్నారని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను పదే పదే ఎన్నుకుంటారు. తల్లి పార్ధీవ దేహానికి నిప్పు పెట్టిన 2 గంటల్లోనే మళ్లీ విధుల్లో చేరి పని ప్రారంభించిన వ్యక్తి నరేంద్రమోదీ అని.. అలాంటి ప్రధానిని తాను చూడలేదని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi, Rahul Gandhi