ఇస్రో మానవ సహిత గగన్‌యాన్‌కు డెడ్‌లైన్ ఎప్పుడో తెలుసా..?

Gaganyaan Mission | మానవ సహిత గగన్‌యాన్ యాత్రలో కేవలం పురషులను మాత్రమే కాకుండా.. మహిళా వ్యోమోగాములను కూడా అంతరిక్షంలోకి పంపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే అది తమ చేతిలో లేదని సెలక్షన్ కమిటీ సూచన మేరకే ఎవరిని పంపించాలన్నది నిర్ణయిస్తామని అన్నారు.

news18-telugu
Updated: January 11, 2019, 2:25 PM IST
ఇస్రో మానవ సహిత గగన్‌యాన్‌కు డెడ్‌లైన్ ఎప్పుడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం..
news18-telugu
Updated: January 11, 2019, 2:25 PM IST
మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌' ఏర్పాట్లు ముమ్మరం చేసినట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు డిసెంబర్, 2021ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రాజెక్ట్ కోసం కేంద్రం నుంచి రూ.30వేల కోట్ల నిధులకు అనుమతి లభించిందని, ఇందులో రూ.10వేల కోట్లు చంద్రయాన్-2 కోసం వెచ్చించనున్నట్టు తెలిపారు. చంద్రయాన్-2 ఆపరేషన్ రాబోయే ఏప్రిల్ నెలలో ప్రారంభించనున్నారు.మానవ సహిత గగన్‌యాన్ యాత్రలో కేవలం పురషులను మాత్రమే కాకుండా.. మహిళా వ్యోమోగాములను కూడా అంతరిక్షంలోకి పంపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే అది తమ చేతిలో లేదని సెలక్షన్ కమిటీ సూచన మేరకే ఎవరిని పంపించాలన్నది నిర్ణయిస్తామని అన్నారు.

ఇస్రో చరిత్రలో గగన్‌యాన్ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సంస్థ కార్యకలాపాలకు ఇది మరింత దోహదపడుతుంది. గగన్‌యాన్ యాత్రలో పాల్గొనే వ్యోమోగాములకు తొలుత ఇండియాలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఆపై రెండో విడుత శిక్షణ కార్యక్రమాలు రష్యాలో ఉంటాయి. మహిళా వ్యోమోగాములను కూడా అందులో భాగం చేయాలన్నదే మా లక్ష్యం.
ఇస్రో చైర్మన్ శివన్


gaganyaan mission,gaganyaan 2021, gaganyaan mission head, isro recruitment 2019, isro chairman praveen kumar, chandrayan 2, గగన్‌యాన్ మిషన్, గగన్‌యాన్, ఇస్రో గగన్‌యాన్, శ్రీహరికోట, ఇస్రో ఛైర్మన్ శివన్, ఇస్రో జాబ్స్ 2019

ఇక రాబోయే జులైలో అతి చిన్న శాటిలైట్‌ను లాంచ్ చేయబోతున్నట్టు తెలిపారు. కేవలం 500కేజీల బరువు ఉండే ఈ శాటిలైట్‌ను 72గంటల్లో, ఆరుగురు వ్యక్తులతో కూడిన టీమ్ లాంచ్ చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం కేవలం రూ.30కోట్లు అని తెలిపారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఆరు ఇంక్యుబేషన్&రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చాలామంది భారతీయ విద్యార్థుల్లో నాసాలో పరిశోధనల కోసం వెళ్తున్నారని.. భవిష్యత్తులో ఆ అవసరం లేకుండా వారందరినీ ఇస్రోకే తీసుకొస్తామని చెప్పారు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...