ట్రాఫిక్ చలాన్లు భారీగా తగ్గింపు.. మోదీకి షాకిచ్చిన గుజరాత్ సీఎం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫైన్ల మోత మోగిస్తుటే.. అదే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ సీఎం విజయ్ రూపానీ జరిమానాలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించారు.

news18-telugu
Updated: September 10, 2019, 8:05 PM IST
ట్రాఫిక్ చలాన్లు భారీగా తగ్గింపు.. మోదీకి షాకిచ్చిన గుజరాత్ సీఎం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 10, 2019, 8:05 PM IST
కొత్త వాహన చట్టం దెబ్బకు వాహనదారులు వణికిపోతున్నారు. వేలకు వేలు జరిమానాలు విధిస్తుండడంతో బెంబేలెత్తుతున్నారు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. బయటకు వచ్చే ముందు సర్టిఫికెట్లను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకొని వస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వాహన చట్టం (సవరణ)-2019 కింద కేంద్రం ప్రకటించిన జరిమానాలను గుజరాత్‌లో భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫైన్ల మోత మోగిస్తుటే.. అదే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సీఎం విజయ్ రూపానీ జరిమానాలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించారు.  ఏకంగా 50శాతం మేర తగ్గించడంతో వాహనదారులు రిలాక్స్ అవుతున్నారు.

గుజరాత్‌లో సవరించిన ట్రాఫిక్ కొత్త జరిమానా వివరాలు:

1. కొత్త చట్టం ప్రకారం హెల్మెట్ లేకుంటే రూ.1000 ఫైన్ విధిస్తారు. కానీ గుజరాత్లో మాత్రం రూ.500.

2. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే కొత్త చట్టం ప్రకారం రూ.1000 జరిమానా వేస్తారు. గుజరాత్‌లో ట్రిపుల్ రైడింగ్ ఫైన్‌ని రూ.100కి తగ్గించారు.3. కొత్త చట్టం ప్రకారం సీట్ బెల్ట్ లేకుంటే రూ.1000 చలానా వేస్తారు. గుజరాత్‌లో రూ.500 మాత్రమే విధిస్తారు.

4. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుడితే కొత్త చట్టం ప్రకారం రూ.5వేలు జరిమానా పడుతుంది. గుజరాత్‌లో దాన్ని రూ.2వేలకు తగ్గించారు.

5. భారీ వాహనాల డ్రైవర్లు లైసెన్స్ లేకుండా పట్టుబడితే కొత్త చట్టం ప్రకారం రూ.5వేలు జరిమానా పడుతుంది. గుజరాత్‌లో దాన్ని రూ.3వేలకు తగ్గించారు.
Loading...
6. ఇక పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా దొరికితే రూ.10వేలు ఫైన్ పడుతుంది. కానీ గుజరాత్‌లో దాన్ని రూ.వెయ్యికి తగ్గించారు.

  ఉల్లంఘన దేశమంతటా గుజరాత్‌లో
హెల్మెట్ లేకుంటే రూ.1,000 రూ.500
 బైక్ ట్రిపుల్ రైడింగ్ రూ.1,000 రూ.100
సీట్ బెల్ట్ లేకుంటే రూ.1,000 రూ.500
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ లేకుంటే (2 వీలర్) రూ.5,000 రూ.2,000
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ లేకుంటే (హెవీ వెహికిల్స్) రూ.5,000 రూ.3,000
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే (లైట్ వెహికిల్స్) రూ.10,000 రూ.1,000
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే (హెవీ వెహికిల్స్) రూ.10,000 రూ.3,000


First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...