G20 Summit: G20 సదస్సు సందర్భంగా ఇండోనేషియా లోని బాలిలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi). సమ్మిట్(G20 Summit)లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ (Ukraine War)లో కాల్పుల విరమణ జరగాలని, యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే మార్గాన్ని కనుగొనాలని పదే పదే చెబుతున్నానని తెలిపారు. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న 17వ G20 లీడర్స్ సమ్మిట్‌లో ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ సెషన్‌కు హాజరైన మోదీ, మంగళవారం యుద్ధం గురించి ప్రస్తావించారు.
* ప్రపంచానికి శాంతి మార్గం చూపాలి
గత శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలో విధ్వంసం సృష్టించిందని తెలిపారు. ఆ తర్వాత ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించేందుకు నాటి నాయకులు తీవ్రంగా ప్రయత్నించారని చెప్పారు. ఇప్పుడు మన వంతు వచ్చిందని G20 లీడర్స్‌ను ఉద్దేశించి అన్నారు. కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించే బాధ్యత కోవిడ్ అనంతర కాలం మన భుజాలపై ఉందని చెప్పారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం, భద్రతను కల్పించడానికి కచ్చితమైన, సామూహిక సంకల్పాన్ని చూపడం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పుణ్యభూమిలో G20 సమావేశాలు జరుగనున్నాయని, ప్రపంచానికి బలమైన శాంతి సందేశాన్ని అందజేయడానికి అందరం కలిసి ముందుకు సాగుతామని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
Modi visit to Bali: ఇండోనేషియాలో మోదీ 45 గంటల పర్యటన.. 20కి పైగా సమావేశాలతో ప్రధాని బిజీ
* భారత ఇంధన భద్రత ప్రపంచానికి ముఖ్యం
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి పాశ్చాత్య నేతలు హాజరైన సమావేశంలో ప్రధాని మోదీ ఇంధన భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియా అని, భారతదేశ ఇంధన భద్రత ప్రపంచ వృద్ధికి కూడా ముఖ్యమని చెప్పారు. ఇంధన సరఫరాపై ఎలాంటి పరిమితులను ప్రోత్సహించకూడదని, ఇంధన మార్కెట్లో స్థిరత్వం ఉండేలా చూడాలని మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై మాస్కో దాడి చేసిన తరువాత అనేక దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయకూడదని ప్రకటించాయి. అయితే ఇండియా కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో పాశ్చాత్య మిత్రదేశాల నుంచి విమర్శలను ఎదుర్కొంది.
Village for Sale : అమ్మకానికి గ్రామం.. విలువ రూ.2 కోట్లు.. కొనేస్తారా?
* క్లీన్ ఎనర్జీపై ఇండియా
క్లీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 2030 నాటికి ఇండియాలో సగం విద్యుత్తు పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. ఎనర్జీ ట్రాన్సిషన్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు టెక్నాలజీ చాలా అవసరమని తెలిపారు. భౌగోళిక సవాళ్లను ఎదుర్కోవడంలో UN వంటి సంస్థలు విఫలమయ్యాయని అంగీకరించడానికి వెనుకాడకూడదని, ఈ రోజు ప్రపంచం G-20 నుంచి ఎక్కువ ఆశిస్తోందని మోదీ అన్నారు.
* సోమవారం బాలి చేరుకొన్న మోదీ
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల G20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు సోమవారమే ప్రధాని మోదీ, బాలి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ సమస్యలపై తీసుకోవాల్సిన చర్యల గురించి కీలక నేతలతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. తన 45 గంటల పర్యటనలో, ప్రధాని మోదీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సహా కీలకమైన అంశాలపై చర్చించనున్నారు.
Historical Facts : నమ్మలేని నిజాలు .. చరిత్రకు సజీవ సాక్ష్యాలు
ఇండియా తదుపరి ఏడాదికి G20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న సందర్భంగా.. మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బాలి చేరుకున్న తర్వాత, ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. బాలీలో ఘన స్వాగతం పలికినందుకు భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రముఖులు, ఇతర దేశాల నాయకులు హాజరయ్యారు.
* ప్రధాని మోదీ షెడ్యూల్
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీ దాదాపు 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 10 మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను మోదీ ప్రత్యేకంగా కలుస్తారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సెప్టెంబరులో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమావేశంలో ఇద్దరూ చివరిసారిగా కలుసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు నాయకుల మధ్య అధికారిక లేదా అనధికారిక సమావేశం జరగలేదు.
మరోవైపు, G20 సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడంలేదు, ఆ దేశానికి విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఇండోనేషియాలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ప్రధాని సమావేశం అవుతారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనను వీక్షిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: G20 Summit, Indonesia, PM Narendra Modi, Russia-Ukraine War, Ukraine