హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భారతదేశ కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో లింగ అసమానత్వాన్ని ఎదుర్కోవడం

భారతదేశ కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో లింగ అసమానత్వాన్ని ఎదుర్కోవడం

covid 19

covid 19

భారతదేశంలో, మహిళల కంటే పురుషుల జనాభా ఎక్కువ. అయితే, వ్యాక్సిన్ అందించడంలో అసమానత్వానికి3 ఇది కూడా ఒక కారణమని హిందుస్థాన్ టైమ్స్ విశ్లేషణ చెబుతోంది.

  భారతదేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యాక గత తొమ్మిది నెలల నుండి వేగం పుంజుకుంది. ఇప్పటివరకు మొత్తంగా 87 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందజేయబడ్డాయి. ఇటీవలి కాలంలో, వ్యాక్సినేషన్ డేటాను గమనిస్తే లింగ అసమానత్వం ఒక కొత్త అంశంగా తెర మీదకి వస్తోంది.


  ఇప్పటివరకు అందించిన డోసులలో, పురుషులకు 45.14 కోట్ల1 డోసులు అందగా, మహిళలకు 41.51 కోట్ల2 డోసులు అందాయి. అంటే 51.88% డోసులు పురుషులకు, 47.70% డోసులు మహిళలకు ఇవ్వబడ్డాయి. మహిళలతో పోల్చితే పురుషులకు 3 కోట్ల డోసులు ఎక్కువగా అందాయి.


  భారతదేశంలో, మహిళల కంటే పురుషుల జనాభా ఎక్కువ. అయితే, వ్యాక్సిన్ అందించడంలో అసమానత్వానికి3 ఇది కూడా ఒక కారణమని హిందుస్థాన్ టైమ్స్ విశ్లేషణ చెబుతోంది. వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభంలో గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వారికి కూడా వ్యాక్సిన్ సురక్షితమని తేల్చిచెప్పినప్పటికీ, కొన్ని మూఢనమ్మకాలు, తప్పుడు ప్రచారాల కారణంగా, వ్యాక్సిన్ వేసుకోవడానికి గర్భవతులు, పాలిచ్చే తల్లులు వెనకాడుతున్నారు. అలాగే రుతుక్రమం సమయంలో వ్యాక్సిన్ గురించి కూడా ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం కారణంగా, రుతుక్రమంలో ఉన్న మహిళలు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకుంటే గర్భధారణలో సమస్యలు వస్తాయనే ప్రచారం కూడా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ముందుకు రాకుండా చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకుంటే వారు గర్భం దాల్చలేరని, పిల్లలు కనలేరనే భయంతో వారు వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. అవగాహన పెంచడానికి ఎన్నో వనరులు ఉన్నా, ప్రయత్నాలు జరుగుతున్నా, దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రం వాస్తవాలు కాకుండా తప్పుడు సమాచారమే ముందుగా తెలుస్తోంది.


  చాలా కుటుంబాల్లో, ఇంటి బాధ్యతలను పురుషులే చూసుకుంటారు. కాబట్టి వారి పనులను సవ్యంగా చేయడంలో భాగంగా ముందుగా వ్యాక్సినేషన్ తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉండటం కూడా మహిళలు వెళ్లి, వ్యాక్సిన్ తీసుకోలేకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. నేటికీ చాలా కుటుంబాల్లో, మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే, అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే వారు వ్యాక్సిన్ కేంద్రాల వరకు రాలేకపోతున్నారు. ఇంట్లో పురుషుని తోడు లేకుండా వారు వ్యాక్సిన్ చేయించుకోలేకపోతున్నారు. కుటుంబ బాగోగులు చూసుకోవాల్సింది మహిళలే కాబట్టి, తాము వ్యాక్సిన్ తీసుకుంటే, దాని సైడ్ ఎఫెక్టుల కారణంగా ఇంటి పనులు చేసుకోలేక పోతారనే భావనతో కూడా వారు వ్యాక్సిన్ కోసం ముందుకు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే, ఎన్నో కుటుంబాల్లో మహిళలకు స్మార్ట్‌ఫోన్‌లకు యాక్సెస్ లేదు. ఇలా సాంకేతికతకు దూరమవడం కూడా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ వేసుకోవడానికి వారిని దూరం చేస్తోంది.


  ప్రచారం ప్రారంభ రోజుల్లో, వ్యాక్సిన్ అందడంలో లింగ అసమానత్వం చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మిజోరాం రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలకే4 వ్యాక్సిన్లు అందాయి.


  ఆర్థికంగా వెనకబడిన వారికి, గ్రామీణ ప్రాంత కమ్యూనిటీలకు వ్యాక్సినేషన్లను అందుబాటులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు కూడా ఉపయోగపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో, గ్రామాలు, కమ్యూనిటీలలో వికేంద్రీకృత వ్యాక్సినేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నారు, తద్వారా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లడానికి ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా వీలు కల్పిస్తున్నారు. దీని వల్ల ఎక్కువ మంది మహిళలు వ్యాక్సిన్ వేసుకోగలుగుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇప్పుడు ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్లు, వాక్-ఇన్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, Co-WIN పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోలేకపోయిన మహిళలు, నేరుగా కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. ముంబైలో, ముఖ్యంగా మహిళల కోసం సిటీలోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వాక్-ఇన్ వ్యాక్సినేషన్ కూడా జరిగింది.


  లింగ అసమానత్వాన్ని ఎదుర్కోవడంలో ఇవి షరిష్కారాన్ని చూపించినప్పటికీ, ఈ చర్యలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసి అందరికీ ఒకేలా వ్యాక్సిన్ అందజేయాల్సిన అవసరం ఉంది. జాతీయ మహిళ కమిషన్ (NCW) ప్రకారం, ప్రజారోగ్యం గురించి అవగాహన ఏర్పరిచి, ఎక్కువ మంది మహిళలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చేలా చేయడంపై దృష్టిసారించాలి. ఇందుకోసం అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ (ASHA), అంగన్వాడీ వర్కర్లు, ఇతర సామాజిక, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సహాయం తీసుకోవాలి. ఏళ్ల నుంచి వస్తున్న లింగ-అసమానతలను పారద్రోలి, ఆరోగ్యం విషయంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం.


  ప్రస్తుతానికి, ట్రాన్స్‌జెండర్‌లు, నాన్-బైనరీ, జెండర్ ఫ్లూయిడ్ మొదలగు వర్గాల వ్యాక్సినేషన్ స్థితి గురించి చాలా తక్కువ డేటా అందుబాటులో ఉంది. వీరి వివరాలన్నీ Co-WIN డ్యాష్‌బోర్డులో 'ఇతరులు' కేటగిరీలో ఉన్నాయి. దాని ప్రకారం ఇప్పటి వరకు ఈ వర్గాల వారికి 191690 వ్యాక్సిన్లు5 అందజేయబడ్డాయి.


  -     ఐశ్వర్య అయ్యర్


  కోఆర్డినేటర్ – కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్,


  యునైటెడ్ వే ముంబై  1 Data from Co-WIN dashboard, Ministry of Health and Family Welfare updated as on 28th September 12:00 PM  2 Data from Co-WIN dashboard, Ministry of Health and Family Welfare updated as on 28th September 12:00 PM  3 https://www.hindustantimes.com/analysis/there-is-a-gender-gap-in-india-s-vaccination-coverage-101623060093797.html  4 As per data taken from Co-WIN dashboard, Ministry of Health and Family Welfare on 28th September 12:00 PM  5 Data from Co-WIN dashboard, Ministry of Health and Family Welfare updated as on 28th September 12:00 PM

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: AP News, Corona cases, Vaccinated for Covid 19

  ఉత్తమ కథలు