మోకాళ్ల లోతు నీటిలో అష్టకష్టాలు పడుతూ అంతిమయాత్ర..

స్మశానానికి వెళ్లే దారి పూర్తిగా వరదమయం కావడంతో.. వరద నీళ్లలోనే శవయాత్ర సాగించారు.వర్షం పడ్డ ప్రతీసారి గ్రామంలో తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని.. సమీపంలోని కాల్వ ఉప్పొంగి గ్రామం జలమయం అవుతోందని స్థానికులు వాపోతున్నారు.

news18-telugu
Updated: October 5, 2019, 2:49 PM IST
మోకాళ్ల లోతు నీటిలో అష్టకష్టాలు పడుతూ అంతిమయాత్ర..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 5, 2019, 2:49 PM IST
మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందసౌర్ జిల్లా నౌగావ్ అనే గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామం పూర్తిగా జలమయం అయిపోయింది. ఇదే క్రమంలో ఇటీవల ఓ మహిళ చనిపోవడంతో... మోకాళ్ల లోతు నీళ్లలోనే బంధువులు ఆమె శవయాత్రను నిర్వహించారు. స్మశానానికి వెళ్లే దారి పూర్తిగా వరదమయం కావడంతో.. వరద నీళ్లలోనే శవయాత్ర సాగించారు.వర్షం పడ్డ ప్రతీసారి గ్రామంలో తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని.. సమీపంలోని కాల్వ ఉప్పొంగి గ్రామం జలమయం అవుతోందని స్థానికులు వాపోతున్నారు.వేరే ఊరికి వెళ్లాలంటే ఆ కాల్వను దాటుకుని వెళ్లాలని.. దానిపై వంతెన నిర్మించాలని ఏళ్ల నుంచి అధికారులను కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు.ఇప్పటికైనా తమ గోడును అర్థం చేసుకుని ఆ కాల్వపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.


First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...