హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మొత్తం వేతనం చెల్లించనున్న రైల్వే శాఖ

కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మొత్తం వేతనం చెల్లించనున్న రైల్వే శాఖ

అర్హులైన రైల్వే ఉద్యోగికి అత్యధికంగా రూ.17,951 మొత్తం అందుతుంది. ప్రతి సంవత్సరం దసరా / దీపావళి ముందు పెర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్, నాన్ పెర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది.

అర్హులైన రైల్వే ఉద్యోగికి అత్యధికంగా రూ.17,951 మొత్తం అందుతుంది. ప్రతి సంవత్సరం దసరా / దీపావళి ముందు పెర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్, నాన్ పెర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది.

రైల్వే శాఖ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. లౌక్ డౌన్ నేపథ్యంలో ప్యాసింజర్లను నిలిపేసినప్పటికీ.. పూర్తి వేతనం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వే శాఖ ఈనెల 31 వరకు ప్యాసింజర్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కాంట్రాక్టు ఉద్యోగులుగా రైల్వేలో పనిచేస్తున్న లక్షలాదికి మందికి రైల్వే శాఖ మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల మొత్తం వేతనం కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఔట్ సోర్సింగ్, ప్రైవేటు, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులుగా రైళ్లు, స్టేషన్లు, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారందరికీ లౌన్ డౌన్‌లో ఉన్నా.. ఆన్ డ్యూటీగా పరిగణించి లాక్‌డౌన్ ముగిసే వరకు పూర్తిస్థాయి వేతనం ఇవ్వనున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. వాస్తవానికి రైల్వే సర్వీసులు నిలిపేసిన కారణంగా వారికి వేతనాల్లో కోత పెట్టొద్దని, సూచించిన విధంగానే వేతనాలు చెల్లించాలని రైల్వే బోర్డు తెలిపింది.

    Published by:Anil
    First published:

    Tags: Indian Railways, Rail, Railway employees, Railways

    ఉత్తమ కథలు