‘రంజాన్‌లో మినహాయింపులు ఇచ్చాం’… క్లారిటీ ఇచ్చిన ఈసీ

రంజాన్ పండగతో పాటు రంజాన్ మాసంలోని అన్ని శుక్రవారాలను మినహాయించి ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వివరణ ఇచ్చింది.

news18-telugu
Updated: March 11, 2019, 4:10 PM IST
‘రంజాన్‌లో మినహాయింపులు ఇచ్చాం’… క్లారిటీ ఇచ్చిన ఈసీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రంజాన్ మాసంలో ఎన్నికలు నిర్వహణపై పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రంజాన్ పండగతో పాటు రంజాన్ మాసంలోని అన్ని శుక్రవారాలను మినహాయించి ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వివరణ ఇచ్చింది. రంజాన్ మాసం మొత్తం ఎన్నికలు నిర్వహించకుండా ఉండటం సాధ్యంకాదని కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అంతకుముందు రంజాన్ మాసంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో ఎన్నిక‌లు నిర్వహించే అంశాన్ని మరోసారి పరిశీలించాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ముస్లింలంతా ఉపాసన దీక్షలో ఉన్న సమయంలో ఓటింగ్‌లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. అయితే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం రంజాన్ మాసంలో ఎన్నిక‌లు జ‌రిపితే త‌ప్పేంట‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రంజాన్ మాసం ఉన్న నేప‌ధ్యంలో షెడ్యూల్ మ‌రో మారు ప‌రిశీలించాల‌న్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. కొంత మంది దినిపై అన‌వ‌స‌ర రాద్దంతం చేస్తోన్నార‌ని ఆరోపించారు.
First published: March 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు