గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీదే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. గుజరాత్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామన్న బీజేపీ అంచనాలు నిజమయ్యే విధంగా ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలు ఉన్నాయి. గుజరాత్లో(Gujarat) మొత్తం సీట్ల సంఖ్య 182 కాగా.. అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మెజార్టీ మార్క్ 92 సీట్లు. టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గుజరాత్లో బీజేపీకి 125-130, కాంగ్రెస్‌కు 40-50 సీట్లు, ఆప్ 3-5, ఇతరులకు 3-5 సీట్లు వచ్చే అవకాశంఉంది. ఇక జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీకి 117-140, కాంగ్రెస్‌కు 34-51 సీట్లు, ఆప్ 6-13, ఇతరులకు 1-2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. P Marq ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 128-148, కాంగ్రెస్‌కు 30-42 సీట్లు, ఆప్ 2-10, ఇతరులకు 0-3 సీట్లు రావొచ్చని వెల్లడించింది.
ఇక 68 సీట్లు ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మెజార్టీ మార్క్ 35 సీట్లు కాగా.. ఇక్కడ బీజేపీ , కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి 34-39, కాంగ్రెస్‌కు 28-33 సీట్లు, ఆప్ 0-1, ఇతరులకు 1-4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ETG ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీకి 38, కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఆప్ 0, ఇతరులకు 2 సీట్లు రావొచ్చు. న్యూస్ఎక్స్ అంచనా ప్రకారం బీజేపీకి 32-34, కాంగ్రెస్‌కు 27-34 సీట్లు, ఆప్ 0, ఇతరులకు 1-2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బార్క్ ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 20-25 సీట్లు, ఆప్ 0-3, ఇతరులకు 1-5 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
మొత్తం 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి మొదటి దశలో 89 స్థానాలకు పోలింగ్ జరగ్గా, రెండో దశలో 93 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగుతుంది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023తో ముగుస్తుంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ప్రధాని మోదీ సోదరుడు ఎమోషనల్..నరేంద్ర దేశం కోసం చాలా పని చేస్తున్నారంటూ వ్యాఖ్య..వీడియో
గుజరాత్లో గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా విజయం సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 49.05 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 42.97 శాతం ఓట్లు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exit Polls 2022, Gujarat, Himachal Pradesh Elections 2022