వరుసగా రెండో రోజు.. స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు నేడు స్వల్ప మేర దిగివచ్చాయి.

news18-telugu
Updated: October 19, 2018, 9:27 AM IST
వరుసగా రెండో రోజు.. స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు
ప్రతీకాత్మక చిత్రం(Image: REUTERS)
  • Share this:
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్ప మేర తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారంతో పోలిస్తే శుక్రవారం పెట్రో, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఢిల్లీలో రూ.82.62గా ఉన్న లీటరు పెట్రోల్ ధర శుక్రవారం రూ.82.38కి తగ్గింది. అలాగే లీటరు డీజిల్ ధర పది పైసలు తగ్గి ప్రస్తుతం రూ.75.48గా ఉంది.

గురువారంతో పోలిస్తే శుక్రవారం ముంబైలో లీటరు పెట్రోల్ ధర 24పైసలు తగ్గింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.87.84గా ఉంది. ఇక లీటరు డీజిల్ ధర రూ.79.24 నుంచి రూ.79.13కి తగ్గింది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.84.44 నుంచి రూ.84.21కి తగ్గింది. లీటరు డీజిల్ ధర రూ.77.43 నుంచి 77.33కి తగ్గింది.

చెన్నైలో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర 25పైసలు తగ్గి ప్రస్తుతం రూ.85.63గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.79.93 నుంచి రూ.79.82కి తగ్గింది. కాగా, గత కొన్నాళ్లుగా నిత్యం పెరుగుతూ వస్తున్న పెట్రో, డీజిల్ ధరలను రూ.2.50 మేర తగ్గిస్తూ అక్టోబర్ 4న కేంద్రం కాస్త ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్టోబర్ 18న ధరలు స్వల్పంగా తగ్గగా.. వరుసగా రెండో రోజు కూడా అదే జరగడం గమనార్హం.

First published: October 19, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com